Begin typing your search above and press return to search.

మహానటి దర్శకుడికి లస్ట్ స్టోరీస్ టాస్క్!

By:  Tupaki Desk   |   8 Dec 2019 10:20 AM GMT
మహానటి దర్శకుడికి లస్ట్ స్టోరీస్ టాస్క్!
X
ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు నిర్మించిన 'లస్ట్ స్టోరీస్' భారీగా ప్రేక్షకాదరణ చూరగొన్న సంగతి తెలిసిందే. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సీరీస్ తో కియారాకు భారీగా క్రేజ్ దక్కింది. ఈ లస్ట్ సీరీస్ ను ప్రస్తుతం తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సీరీస్ కు నలుగురు ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారు.

నందిని రెడ్డి.. సంకల్ప్ రెడ్డి.. తరుణ్ భాస్కర్..సందీప్ రెడ్డి వంగా ఈ సీరీస్ కు దర్శకులుగా నెట్ ఫ్లిక్స్ వారు ఎంచుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్సుల కారణంగా సందీప్ వంగా ఈ సీరీస్ నుంచి తప్పుకున్నాడట. దీంతో మరో దర్శకుడి కోసం పలు పేర్లు పరిశీలించిన తర్వాత సందీప్ వంగా స్థానంలో నాగ్ అశ్విన్ ను ఎంపిక చేసుకున్నారట. త్వరలోనే నాగ్ అశ్విన్ ఈ లస్ట్ సీరీస్ కు సంబంధించిన షూటింగులో పాల్గొంటారట.

నాగ్ అశ్విన్ ఇప్పటివరకూ తెరకెక్కించిన సినిమాలన్నీ క్లాసిక్ ఫిలిమ్స్. ఈ లస్ట్ స్టోరీస్ బోల్డ్ స్టైల్ లో ఉంటాయి. మరి నాగ్ అశ్విన్ ఇలాంటి బోల్డ్ కథలను ఎలా ప్రెజెంట్ చేస్తాడో వేచి చూడాలి. ఏదేమైనా నెట్ ఫ్లిక్స్ వారు మహానటి దర్శకుడికి మహా టాస్క్ ఇచ్చినట్టే.