ఎవ్రీ డాగ్ హాజ్ ఏ డే.. వెయిట్ చేయాలి!

Tue Jan 24 2023 10:25:26 GMT+0530 (India Standard Time)

Nabha's Natesh Tickling Charms

'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో డ్యాషింగ్ గ్లామరస్ బ్యూటీ అలరించిన  కన్నడ భామ నభా నటేష్ కెరీర్ పరంగా బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులు అందుకుంది. అయితే ఆ తర్వాతే కథ మలుపు తిరిగింది. స్టార్ హీరోయిన్ గా రాకెట్ లా దూసుకుపోవాలన్న తన ఆలోచనలకు 'డిస్కోరాజా'..'అల్లుడు అదుర్స్'..'మాస్ట్రో' లాంటి ఫ్లాపులు బిగ్ బ్రేక్ వేసాయి.అన్ని పెద్ద ప్రాజెక్ట్ లే. కానీ వైఫల్యాలు అమ్మడిని రేసులో వెనక్కి నెట్టాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ అవకాశాలు కోసం ఎదురు చూస్తుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటూ ఇన్ స్టాని హీటెక్కిస్తుంది.

వరుస పరాజయాల వల్లనే నభాకి అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ బ్యూటీ ఫోటోషూట్లతో నిరంతరం గిలిగింతలు పెట్టే ప్రయత్నాన్ని ఆపడం లేదు. కొన్ని వరుస ఫోటోషూట్లతో యూత్ లో మంచి పాలోయింగ్ ని సంపాదించింది.

నభా నటేష్ తాజా ఫోటోషూట్ అంతర్జాలంలో దుమారం రేపుతోంది. అందమైన ఫ్లోరల్ టాప్  కాంబినేషన్ ఫ్లోరల్ ప్యాంటులో కళాత్మకంగా కనిపిస్తూనే గ్లామరస్ భంగిమలతో హీటెక్కిస్తోంది.

ఈ ఫోటోషూట్ లో ప్రొఫైల్ షాట్ లు  హెయిర్ స్టైల్ నభా ఆకర్షణను మరింత పెంచాయి.

ప్రస్తుతం టాలీవుడ్ లో అకాశాలు తగ్గాయి. మ్యాస్ట్రో తర్వాత నభా వీకీలో ఇంతవరకూ కొత్త సినిమా అప్ డేట్ లేదంటే పరిస్థితి ఏ మేరకు దిగజారిందో అర్థం చేసుకోవాలి. టాలీవుడ్ సహా ఇతర పరిశ్రమల్లో కొత్త అవకాశాల కోసం వెతుకుతోంది.

ఓటీటీలో వెబ్ సిరీస్ అవకాశాల కోసం ప్రయత్నిస్తోందన్న సమాచారం ఉంది. ఇకపై ఫోటోషూట్లపై దృష్టి సారించే కంటే ఓటీటీ సిరీస్ లతో తిరిగి కంబ్యాక్ ని చాటుకుని పెద్ద తెర ప్రయత్నాల్లో వేగం పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.