కొంటె పోజుతో అబ్బా.. అనిపిస్తున్న ఇస్మార్ట్ నభా..!!

Wed Jul 15 2020 17:20:50 GMT+0530 (IST)

Nabha Natesh Cute Pose On Bridge

2018లో నన్ను దోచుకుందువటే.. అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కన్నడ భామ నభ నటేష్. ఈ యంగ్ బ్యూటీ తన ఆకట్టుకునే అందంతో.. అద్భుతమైన అభినయంతో ఫస్ట్ సినిమాతోనే కుర్ర హృదయాలను దోచుకుంది. ఇక అదే సినిమాతో తెలుగు స్టార్ డైరెక్టర్స్.. హీరోల దృష్టిని తనవైపు తిప్పుకుంది. కన్నడ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన నభ.. ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో దూసుకెళ్తూ టాలీవుడ్ లో  పర్మినెంట్ స్థానం సంపాదించుకొని బిజీ హీరోయిన్ కావాలని ప్రయత్నం చేస్తోంది. గతేడాది డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి సినీప్రియులను ఫిదా చేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అమ్మడి నటనకు.. డేరింగ్ కి స్టార్ హీరోలు సైతం వారి సినిమాలలో అవకాశం ఇస్తున్నారు.ఇటీవలే మాస్ రాజా రవితేజ సరసన డిస్కోరాజా సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో కాస్త స్లో అయినట్లు కన్పిస్తుంది. ప్రస్తుతం ఈ కన్నడ భామ సాయిధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే కరోనా లాక్ డౌన్ విధించడం జరిగింది. ఇక ఎలాగో ఖాళీగా ఉంటున్నా కదా అని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు చేరువవుతోంది అమ్మడు. ఎప్పటికప్పుడు తన సినిమాల విషయాలతో పాటు కొత్త డ్రెస్సింగ్ స్టైల్.. స్టైలిష్ లుక్స్ తో వావ్ అనిపించే ఫోటోలను చేస్తోంది. ఇక తాజాగా అమ్మడు ఓ పిక్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో నభ.. టిషర్ట్ ధరించి కెమెరాకి ఇచ్చిన పోజుతో మతులు పోగొడుతుంది. అలా కొంటె చూపులతో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అమ్మడి కవ్వించే సోయగాలకు ఇంస్టాగ్రామ్ మొత్తం ఫిదా అవుతోంది.