తారక్ 300 కోట్లు.. చరణ్ 250 కోట్లు!

Wed Mar 29 2023 12:00:20 GMT+0530 (India Standard Time)

NTR30 and RC15 game changer movie budget

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఎన్టీఆర్ 30 గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం అయింది.ఎన్టీఆర్ కు ఇది 30వ చిత్రం కావడంతో ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. అయితే ఈ సినిమాలో అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. ఈ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది.ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేయబోతున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ సంస్థ పై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్ హరికృష్ణ కె నిర్మిస్తున్న చిత్రం ఇది. అయితే ఈ సినిమా కోసం మొత్తం రూ.300 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం.

సెమీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీంతో అందరి కళ్లూ ఈ సినిమాపైనే పడ్డాయి. అసలే ఆర్ఆర్ఆర్ తో సంచలనం సృష్టించిన తారక్.. ఈ చిత్రంతో ఏ రేంజ్ లో మెప్పించబోతున్నారో తెలియాలంటే ఇంకా చాలా కాలం ఆగాల్సిందే.

మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ తో పాటు పాటల చిత్రీకరణ కూడా ఎప్పటి నుంచో సాగుతుంది. అయితే ఈ చిత్రంలో చెర్రీ పక్కన కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్రం కోసం రూ.250 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సునీల్ వెన్నెల కిషోర్ ప్రియదర్శి నవీన్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించ బోతున్నారు. అంతేకాకుండా నటి ఖుష్బూ కూడా ఈ సినిమాలో నటించబోతున్నారట. ఆమె కనిపించేది కాసేపే అయినా ఆ పాత్ర చాలా కీలకం అని సమాచారం. మరి చూడాలి ఆర్ఆర్ఆర్ తర్వాత రాబోతున్న చెర్రీ తారక్ ల సినిమాలు అభిమానుల్ని ఓ రేంజ్ లో అలరిస్తాయో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.