ఎన్టీఆర్ 30: ఇక మొదలేడధమా!

Sat Apr 01 2023 11:06:18 GMT+0530 (India Standard Time)

Heavy Graphics For NTRr 30

జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అందులో జూనియర్ ఎన్టీఆర్ స్టైల్ పర్ఫార్మెన్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.తారక్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ను అంతే ఒడుపుగా పట్టుకుని కొరటాల శివ జనతా గ్యారేజ్ సినిమాను విజయ తీరాలకు చేర్చారు. వీరిద్దరి పెయిర్ అప్పుడే మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ హిట్ కాంబో NTR30 కోసం మరోసారి జత కలిసిన విషయం తెలిసిందే. ఈ మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది.

శుక్రవారం సాయంత్రం నుండి NTR30 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. గత వారమే సినిమా అనౌన్స్ చేసినప్పటికీ కొరటాల శివ అతని టీం లొకేషన్లు ఖరారు చేసేందుకు కొంత సమయం తీసుకున్నారు. అవి ఫైనలైజ్ కావడంతో శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ లోని ప్యాలెస్ లో షూటింగ్ ను ప్రారంభించింది NTR30 మూవీ టీం

కోస్టల్ ఐలాండ్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. విజువల్ ఎఫెక్ట్స్ కీలక పాత్ర పోషించనున్నాయి. సముద్రంలో వచ్చే ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సన్నివేశాలను గ్రీన్ స్క్రీన్ లను ఉపయోగించి స్టూడియోలోనే చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తారు.

సినిమా నిర్మాణ బడ్జెట్ లో సెట్లు గ్రాఫిక్స్ కే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుందని మూవీ మేకర్స్ అంటున్నారు. NTR30 విజువల్ ఎఫెక్ట్స్ ని హాలీవుడ్ టెక్నీషియన్ హ్యాండిల్ చేయనున్నారు. NTR30 మూవీ కూడా ఆర్ఆర్ఆర్ లాగే గ్రాఫిక్స్ ప్రాధాన్యత ఉన్న సినిమా కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ రిచ్ గా ఉండేలా ఎన్టీఆర్ ప్రత్యేక జాగ్రత్త పడనున్నట్లు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు లభించింది. దీనిని కొనసాగించేలా తన NTR30 మూవీ ఉండేలా తన రీచ్ ను పెంచుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే NTR30 మూవీ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడే ఉద్దేశం లేదని సమాచారం.