Begin typing your search above and press return to search.

#NTR30 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌

By:  Tupaki Desk   |   19 Feb 2020 5:00 AM GMT
#NTR30 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌
X
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆయన తదుపరి చిత్రం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అనే విషయం తెల్సిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో అరవింద సమేత చిత్రం వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను సాధించలేదు. పాజిటివ్‌ టాక్‌ ను దక్కించుకున్నా ఫ్యాన్స్‌ కు పూర్తి స్థాయి సంతృప్తిని ఇవ్వలేదు. అందుకే మరోసారి వీరి కాంబో కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూశారు. ఇప్పుడు వీరి కాంబో మూవీకి సంబంధించిన ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్‌.. త్రివిక్రమ్‌ మూవీని సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ నిర్మాత నాగ వంశీ నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్‌ హోమ్‌ బ్యానర్‌ గా చెప్పుకునే హారిక హాసిని క్రియేషన్స్‌ లో ఒక పార్ట్‌ గా సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ ను చెప్పుకుంటూ ఉంటారు. రాధాకృష్ణనే సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ కు కూడా అధినేత అనే టాక్‌ ఇండస్ట్రీ లో ఉంది. ఆ విషయం పక్కన పెడితే త్రివిక్రమ్‌ ఈమద్య అన్ని సినిమాలు కూడా హారిక హాసిని క్రియేషన్స్‌ లో వస్తున్నాయి. కాని ఈసారి మాత్రం సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ లో రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ నిర్మాత అయిన నాగవంశీ నేడు సాయంత్రం ఒక ఆసక్తికర ప్రకటన చేయబోతున్నట్లుగా ఇప్పటికే ట్విట్టర్‌ లో పేర్కొన్నాడు. దాంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అంతా కూడా చాలా ఇంట్రెస్ట్‌ తో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌30 అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ ను ట్రెండ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ రేంజ్‌ లో ప్రస్తుతం ఇది నెం.1 గా ట్రెండ్‌ అవుతుంది. జాతీయ స్థాయిలో కూడా ఇది టాప్‌ లో ఉంది. ఎన్టీఆర్‌ 30 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో అది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.