ప్రత్యర్థులను అలా చెంప దెబ్బ కొట్టిన ఎన్టీఆర్

Thu Jun 10 2021 15:00:01 GMT+0530 (IST)

NTR slapped opponents like that

నందమూరి కుటుంబ హీరోల నడుమ కలతల గురించి రకరకాల సందర్భాల్లో చర్చ సాగింది. ఇక తెలుగు దేశం పార్టీ(టీడీపీ)ని ముందుకు నడిపించే సత్తా జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే ఉందని ఓ సెక్షన్ మీడియా కథనాలు వైరల్ అయిన సంగతి తెలిసినదే.నారా కుటుంబానికి నందమూరి కుటుంబానికి ఎదురెళ్లి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సొంతంగా పార్టీని ప్రారంభిస్తారని ప్రచారమవుతోంది. ఇప్పటికీ ఎప్పటికీ అన్ లిమిటెడ్ గా దీనిపై చర్చ సాగుతూనే ఉంటుంది. కానీ  యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా చేసిన ఓ పని ప్రత్యర్థులను తీవ్రంగా నిరాశకు గురి చేసింది.

గురువారం ఉదయం 8:26 గంటలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ లో  నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒక అందమైన ఫోటోతో విషెస్ ని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ తక్షణమే వైరల్ అయ్యింది. లక్షలాది మందిలోకి దూసుకెళ్లింది. బాబాయ్ బాలయ్యపై అబ్బాయ్ రామారావు అభిమానం ప్రతిసారీ బయటపడుతూనే ఉంది. అది గౌరవం భక్తి భయంతో కూడుకున్నది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ ఇద్దరి మధ్యా డిఫరెన్సెస్ అంటూ ప్రచారం మాత్రం ఆగదు.

ఇటీవల రకరకాల సందర్భాల్లో కళ్యాణ్ రామ్ -తారక్ బ్రదర్స్ తమపై సాగేదంతా తప్పుడు ప్రచారం అని ప్రూవ్ చేసేందుకు ప్రయత్నించారు. బాబాయ్ బాలకృష్ణతో ఎలాంటి పొరపొచ్చాలు లేవని నిరూపిస్తూ భయం భక్తిని కనబరిచారు. ``టీడీపీకి నేను దూరం కాదు.. కానీ రాజకీయాల్లోకి రాను! అనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపేందుకు తారక్ చేయని ప్రయత్నం లేదు. అందుకే బాలయ్యకు ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ చాలామందిని నిరాశపరిచి ఉండొచ్చు అంటూ టాక్ వినిపిస్తోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అఖండ కొత్త పోస్టర్ # NBK107 ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. బాలయ్య లుక్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఇండస్ట్రీలో ఇతర స్టార్లలో మెగాస్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ మహేష్ సహా పలువురు స్టార్లు ఎన్బీకేకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.