మహేష్ తర్వాత ఎన్టీఆర్.. ఫ్యామిలీతో సందడి

Thu Oct 28 2021 11:01:21 GMT+0530 (IST)

NTR make a trip abroad With His Family

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ కు వెళ్లాడు. అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే సర్కారు వారి పాట చిత్రీకరణ లో పాల్గొంటున్నాడు. మహేష్ బాబు రెగ్యులర్ గా ఫ్యామిలీతో కలిసి హాలీడే కు విదేశాలకు వెళ్లే విషయం తెల్సిందే. మహేష్ బాబు ఫ్యామిలీ మాదిరిగానే ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా రెగ్యులర్ గా విదేశీ ట్రిప్ లు వేస్తారు. కుటుంబంతో కలిసి ఎన్టీఆర్ సరదాగా ట్రిప్ వేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే కరోనా వల్ల గత కొన్నాళ్లుగా ఎన్టీఆర్ విదేశీ ట్రిప్ వేయలేదు. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడటంతో ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి విదేశీ ట్రిప్ ప్లాన్ చేశారని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.ఎన్టీఆర్ మొన్నటి వరకు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తో బిజీ బిజీగా గడిపాడు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే వెళ్లాలి అనుకున్నా కూడా ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇటీవలే ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్ పూర్తి అయ్యింది. ఆ షో షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్ తదుపరి సినిమా ను కొరటాల శివ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. కాని కొరటాల ఆచార్య సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ నాటికి కొరటాల శివ సినిమా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఎన్టీఆర్ కనీసం మూడు నాలుగు వారాల పాటు విదేశీ ట్రిప్ వేయాలని భావించాడట. అయితే ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఏ దేశం వెళ్లబోతున్నారు అనే విషయమై స్పష్టత లేదు.

ఈమద్య కాలంలో ఎక్కువ మంది స్టార్స్ మాల్దీవ్స్ అంటున్నారు. మరి ఎన్టీఆర్ ఫ్యామిలీ అక్కడకు వెళ్తారా లేదంటే యూరప్ లేదా దుబాయికి వెళ్తారా అనేది చూడాలి. ఎన్టీఆర్ నవంబర్ లో తిరిగి ఇండియాకు వచ్చి కొరటాల శివ సినిమాకు రెడీ అవ్వబోతున్నాడు. డిసెంబర్ లో కొరటాల శివ దర్శకత్వంలో మూవీ ని పట్టాలెక్కించబోతున్నారు. సినిమాను సమ్మర్ లోనే విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. కాని షూటింగ్ ఆలస్యం అయిన కారణంగా సినిమాను వచ్చే ఏడాదికి దసరా వరకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆలియా భట్ ను ఎన్టీఆర్ కు జోడీగా సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్.. కొరటాల కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది.