ఎన్టీఆర్ 'ఆర్‌ఆర్‌ఆర్' ను మించిన మల్టీస్టారర్ చేయబోతున్నాడు!!

Wed Apr 21 2021 12:00:01 GMT+0530 (IST)

NTR is going to be a multistarrer beyond 'RRR' !!

భాష ఏదైనా కూడా మల్టీ స్టారర్ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు అనడంలో సందేహం లేదు. భారీ ఎత్తున అంచనాల నడుమ ప్రస్తుతం ఎన్టీఆర్.. రామ్ చరణ్ లతో ఆర్‌ఆర్ఆర్ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమాలు నటిస్తున్న కారణంగా తెలుగు ఆడియన్స్ లోనే కాకుండా ప్రతి ఒక్క సినీ అభిమానిలో కూడా ఈ సినిమా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అందుకే మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.టాలీవుడ్ లో స్టార్ అయిన ఎన్టీఆర్ మరియు కోలీవుడ్‌లో సూపర్ స్టార్ అయిన విజయ్ లు కలిసి ఒక భారీ మల్టీ స్టారర్ ను చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ కు చాలా నమ్మకమైన దర్శకుడు అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లుగా తమిళ మీడియా వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలోనే ఎన్టీఆర్ తో ఒక సినిమా ఉంటుందని అట్లీ ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా వస్తున్న వార్తల నేపథ్యంలో అట్లీ నిజంగానే విజయ్ మరియు ఎన్టీఆర్ లతో భారీ మల్టీ స్టారర్ సినిమాను చేస్తాడేమో అంటూ అభిమానులు ఆశ పెట్టుకున్నారు.

టాలీవుడ్ కోలీవుడ్ లోనే కాకుండా ఈ ఇద్దరు హీరోలకు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉంది. కనుక ఇదో భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందే అవకాశం ఉంది అంటున్నారు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఇద్దరు తెలుగు హీరోలు చేస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ ను మించి తమిళ సూపర్ స్టార్ విజయ్ మరియు తెలుగు సూపర్ స్టార్ ఎన్టీఆర్ కలిసి చేసే సినిమా ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఈ వార్తలు కనుక నిజం అయితే సౌత్ ఇండస్ట్రీలో అతి పెద్ద మల్టీ స్టారర్ గా ఈ సినిమా నిలుస్తుందని అంటున్నారు. విజయ్ మరియు ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా పట్టాలెక్కాలని కోరుకుంటున్నారు. ఈ వార్తలపై అట్లీ స్పందించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఆయన స్పందించేనా చూడాలి.