ఎన్టీఆర్ కూడా తెలివి చూపిస్తున్నాడు

Thu Feb 20 2020 09:39:51 GMT+0530 (IST)

NTR is also showing intelligence

ఈమద్య కాలంలో యంగ్ స్టార్ హీరోలు కేవలం నటించడమే కాకుండా నిర్మాణంపై కూడా ఆసక్తిని కనబర్చుతున్నారు. ప్రస్తుతం ఉన్న పలువురు స్టార్ హీరోల్లో చాలా మందికి సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. కొందరు కుటుంబ సభ్యులతో నిర్మాణ సంస్థలు పెట్టించారు. ఆ హీరోలు ఏ సినిమా చేసినా కూడా ఇతర నిర్మాతలతో కలిసి వారి హోమ్ బ్యానర్ నిర్మాణంలో భాగస్వామిగా అవుతుంది. ఈమద్య ఎక్కువగా ఇలాగే జరుగుతున్నాయి. ఇటీవల బ్లాక్ బస్టర్ అయిన అల వైకుంఠపురంలో చిత్రాన్ని చినబాబుతో కలిసి అల్లు అరవింద్ నిర్మించాడు.. ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రంకు మహేష్ బాబు కూడా కొంత మేరకు నిర్మాణ భాగస్వామిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇక ప్రభాస్ యూవీ క్రియేషన్స్ లోనే వరుసగ సినిమాలు చేస్తున్నాడు. అది ఆయన హోం బ్యానర్. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే దారిలో నడిచేందుకు సిద్దం అయ్యాడు. తన తోటి స్టార్ హీరోలు నిర్మాణ సంస్థలు పెట్టి తమ సినిమాలతో పారితోషికమే కాకుండా విడుదల తర్వాత లాభాల్లో వాటాలు దక్కించుకుంటున్న నేపథ్యంలో తానెందుకు అలా ఉండకూడదని ఎన్టీఆర్ కూడా తెలివి చూపించాడు.

తన 30వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాను హారిక అండ్ హాసిని బ్యానర్ తో పాటు తన అన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ను కూడా చేర్చాడు. తన అన్నకు కమర్షియల్ గా హెల్ప్ అవ్వడంతో పాటు.. తద్వారా తాను కూడా లాభాల్లో వాటాను పొందవచ్చు అనేది ఎన్టీఆర్ ప్లాన్ గా తెలుస్తోంది. మొత్తానికి హీరోలు అంతా కూడా ఇలా తెలివి మీరితే నిర్మాతల పరిస్థితి ఏంటీ అంటూ ఇండస్ట్రీలోని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.