వరల్డ్ షేక్ చేయాలని ఫిక్సైన ఎన్.టి.ఆర్..!

Mon Mar 20 2023 19:00:01 GMT+0530 (India Standard Time)

NTR is Planning to shake the world!

నిన్నటి వరకు ఎన్.టి.ఆర్ కేవలం తెలుగు హీరో తన సినిమాలతో.. తన నటనతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నా కెరీర్ లో ఫస్ట్ టైం ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటాడు. ఆ సినిమాలో ఎన్.టి.ఆర్ చేసిన భీం పాత్రలో మరొకరిని ఊహించుకోలేం అన్నట్టుగా చేసి అలరించాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాల శివ సినిమాతో వస్తున్న తారక్ ఆ సినిమాను నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఇక ఆ తర్వాత సినిమా ప్రశాంత్ నీల్ తో ఉంటుందని తెలుస్తుంది.కె.జి.ఎఫ్ 1 2 పార్ట్ లతో పాపులర్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే కె.జి.ఎఫ్ 3 ప్లానింగ్ లో ఉంది. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తారట. అయితే తారక్ తో ప్రశాంత్ నీల్ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో ఎలాగు పాన్ వరల్డ్ క్రేజ్ తెచ్చుకున్నాడు కాబట్టి ఎన్.టి.ఆర్ 31 ప్రశాంత్ నీల్ వరల్డ్ మొత్తం షేక్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే మాత్రం ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరవేసే ఛాన్స్ ఉంటుంది.

కొరటాల శివ సినిమా కూడా కథ బాగా సెట్ అయ్యిందని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ 30 పూర్తి చేయడమే ఆలస్యం ఏమాత్రం లేట్ చేయకుండా ప్రశాంత్ నీల్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు ఎన్.టి.ఆర్. ఎన్.టి.ఆర్ లాంటి మాస్ హీరో కి ప్రశాంత్ నీల్ లాంటి మాస్ డైరెక్టర్ తోడైతే ఇక ఆ సినిమా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఎన్.టి.ఆర్ ప్రశాంత్ నీల్ ఇద్దరు కలిసి అద్భుతాన్ని సృష్టించాలని చూస్తున్నారు.

ఎన్.టి.ఆర్ 30వ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఎన్.టి.ఆర్ 31లో కూడా బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని చూస్తున్నారట. సలార్ రిలీజ్ అయ్యి హిట్ పడితే ఎన్.టి.ఆర్ సినిమాకు మరింత క్రేజ్ వస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.