అఫిషియల్ : ఆగస్టులో ఎన్టీఆర్ గేమ్ షురూ

Sun Aug 01 2021 18:00:02 GMT+0530 (IST)

NTR game launches in August

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్ ప్రారంభం అయ్యింది. గత రెండు మూడు వారాలుగా షో షూటింగ్ జరుగుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. కాని టెలికాస్ట్ డేట్ ను అనౌన్స్ చేయక పోవడంతో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా లో జెమిని టీవీపై ట్రోల్స్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వర్షన్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమిని టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎన్టీఆర్ గేమ్ షో నుండి కొత్త ప్రోమో వచ్చింది. సర్ ప్రైజింగ్ గా ఉన్న ఈ టీజర్ షో పై ఆసక్తి పెంచుతోంది.షో షూటింగ్ ను ఇప్పటికే ప్రారంభించారు కనుక మరీ ఎక్కువ లేట్ చేయకుండా ఈనెల రెండవ వారం లేదా మూడవ వారం నుండి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో స్టార్ మా లో ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్ 1 కు ఎన్టీఆర్ హోస్ట్ గా చేయడంతో పాటు సక్సెస్ అయ్యాడు. ఆ షో కు తెలుగులో ఇంతటి క్రేజ్ ను తీసుకు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు అనడంలో సందేహం లేదు. అందుకే జెమిని టీవీ వారు ఈ షో కోసం ఎన్టీఆర్ కు భారీ పారితోషికం ఇచ్చి మరీ తీసుకు వచ్చారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ షో ను తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఆధరించడం ఖాయం అని.. రికార్డు స్థాయిలో రేటింగ్ రావడం కూడా ఖాయం అంటూ విశ్లేషకులు నమ్మకంగా ఉన్నారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నెలలోనే గుమ్మడి కాయ కొట్టేందుకు జక్కన్న సిద్దంగా ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా ముగిసిన వెంటనే తన తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్నాడు. ఆ సినిమా చేస్తూ కూడా ఎన్టీఆర్ ఈ షో ను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 90 ఎపిసోడ్స్ గా ఈ షో వస్తుందని అంటున్నారు. రెండు లేదా మూడు వారాల కోసం ఒక్క సారి షూట్ చేస్తూ ఉన్నారు. ఒక్కో షెడ్యూల్ ను వారం రోజుల పాటు చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ను మళ్లీ బుల్లి తెరపై చూడబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ అభిమానులు టెలికాస్ట్ తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు.