ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ntr30 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటన అయితే వచ్చింది కానీ ఇప్పటివరకు సెట్స్పైకి వెళ్లలేదు. అసలు ఈ షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనేది ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పటికే ఎన్టీఆర్తో కలిసి సినిమా చేసిన రామ్ చరణ్ అనేక సినిమాలు లైన్లో పెట్టేశారు. దీంతో తారక్ అభిమానులు ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అయితే తాజాగా తన అన్న కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులు అక్కడ కూడా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు. అయితే అదే సమయంలో యాంకరింగ్ చేసిన సుమ.. ఎన్టీఆర్ 30 అప్డేట్ విషయాన్ని లేవనెత్తింది.
అంతే ఇక ఎందుకో గాని ఎన్టీఆర్ ఈ విషయంలో సీరియస్ అయిపోయాడు. సుమపై సీరియస్ లుక్స్ ఇస్తూ చాలా కోప్పడుతున్నట్లు కనిపించాడు. దీంతో అక్కడే ఉన్న కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ను సముదాయించేందుకు ప్రయత్నించగా.. ఎన్టీఆర్ కాస్త స్థిమిత పడ్డారు. అనంతరం మైక్ తీసుకుని అభిమానులు అడగకపోయినా మీరు చెప్పించేసేలాగా ఉన్నారే అంటూ సుమకు కౌంటర్ వేశారు. ఎన్టీఆర్ 30 అప్డేట్ అనే కాదు ఏ హీరో సినిమా అప్డేట్ అయినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమే బయట పెడతాం. అలా అన్ని సార్లు అడిగితే దర్శక నిర్మాతల మీద ఒత్తిడి పడుతుంది. దయచేసి ఈ విషయంలో అర్థం చేసుకోండి.
అప్డేట్ విషయాల్లో మాకు మా కుటుంబ సభ్యుల కన్నా అభిమానులే ఎక్కువ. మా భార్యల కన్నా ముందే మీకే చెబుతాం అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ను ఉద్దేశిస్తూ అన్నారు. ఒకానొక దశలో ఎన్టీఆర్ ఏంటి ఇంత సీరియస్ అయ్యాడు సుమను ఏమైనా అంటాడేమో అని అందరూ భావించారు. ntr 30 షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభవుతుంది ముందుగా అనుకున్న తేదీకి వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్.. సుమపై సీరియస్ అయిన ఫొటోలు వీడియోలు సోషల్మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆగతార ఇక.. మీమ్స్ రూపంలో సుమను ఓ ఆటాడేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ అభిమానులు కూడా.. మీమ్స్ రూపంలో థ్యాంక్స్ సుమ.. ఏదేమైనప్పటికీ ఏన్టీఆర్ 30 అప్డేట్ ఇప్పించావ్ అంటూ ఫుల్ ట్రెండ్ చేశారు. అసలా మీమ్స్ చూస్తుంటే తెగ నవ్వులే నవ్వులు..
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.