Begin typing your search above and press return to search.
రాములమ్మకి ఎన్టీఆర్ క్షమాపణ..ఎందుకో తెలుసా?
By: Tupaki Desk | 28 May 2023 4:00 PMవిజయశాంతి అలియాస్ రాములమ్మ ఇప్పటికీ యాక్టివ్ గా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సెకెండ్ ఇన్నింగ్స్ లో చాలా సెలక్టివ్ గా వెళ్తున్నారు. నటన కు ఆస్కారం..ధీటైన పాత్రలు తప్ప! చిన్న సినిమాలు చేయడం లేదు. స్టార్ హీరోల చిత్రాలైనా? ఆ పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటేనే నటిస్తున్నారు. అలా ఇటీవలి కాలంలో 'సరిలేరు నీకెవ్వరులో' నటించారు. ఆ సినిమా సక్సెస్ తో రాములమ్మ మళ్లీ నటిగా బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. మరి తను అనుకున్న పాత్రలు రాక నటించలేదా? లేక ఇంకే వైనా కారణాలున్నాయా? అన్నది తెలియాలి.
అయితే తాజాగా విశ్వవిఖ్యాత నటసార్వహౌమ ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు సందర్భంగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నేరుగా ఎన్టీఆర్ ...విజయశాంతి కి క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన అనంతరం మళ్లీ 1990లో సినిమాల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే. 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాతో కంబ్యాక్ అయ్యారు. అయితే ఆ సినిమా డబ్బింగ్ పనులు జరుగుతోన్న చోటనే విజయశాంతి నటిస్తోన్న 'గ్యాంగ్ లీడర్' షూటింగ్ కూడా జరుగుతోంది.
ఆ సమయంలో ఎన్టీఆర్ ని కలుద్దామని విజయశాంతి వెళ్లారుట. అయితే స్పాట్ కి చేరుకున్న తర్వాత వెలుతురు సమస్య కారణంగా గుర్తు పట్టడం ఇబ్బంది గా మారడంతో వెనక్కి తిరిగి వచ్చేసారుట. ఆ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ మరుసటి రోజు విజయశాంతి ఇంటికే (చెన్నై) నేరుగా వెళ్లిపోయారుట. అయితే షూటింగ్ కారణంగా అదే రోజు విజయశాంతి హైదరాబాద్ కి వచ్చేసారుట.
ఆ టైమ్ లో విజయశాంతి ఇంట్లో ఉన్న శ్రీనివాస ప్రసాద్ ని కలిసారుట. పొరపాటు జరిగిందని..బిడ్డను క్షమాపణ అడిగినట్లు ఆయనకి చెప్పి వచ్చారుట. అయినా ఎన్టీఆర్ మనసు కుదుట పడలేదు. హైదరాబాద్ లో వైజయంతీ అందుబాటులో ఉన్న ఫోన్ నంబర్ కనుక్కుని మరీ స్వయంగా ఫోన్ చేసి సారీ చెప్పారుట. ఈ విషయం ఇప్పటివరకూ ఎక్కడా బయట కు రాలేదు. ఇంతకాలం మనసులో దాచుకున్న సారీని తొలిసారి విజయశాంతి రివీల్ చేసింది.