'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి మళ్ళీ బ్రేక్ పడిందా...?

Wed Oct 09 2019 18:33:36 GMT+0530 (IST)

NTR Taking Break from #RRR Movie Shooting

'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం తెలుగు వాళ్లే కాదు అన్ని భాషల సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఉన్న అగ్ర హీరోల్లో ఇద్దరు అగ్ర హీరోలు నటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా నెలకొన్నాయి. పైగా ఈ సినిమా రాజమౌళి లాంటి దర్శకుడు తీస్తుండడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి షూటింగ్ కి ఏదొక ఆటంకం కలుగుతుంది. ఆ మధ్య ఎన్టీఆర్ కి - రాంచరణ్ కి కూడా గాయాలు అవ్వడంతో కొన్నిరోజులు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టారు.ఆ తర్వాత చరణ్ నిర్మాతగా మారి తీసిన 'సైరా' కోసం కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. సైరా మూవీ ప్రమోషన్స్ లో ఉండడంతో రాంచరణ్ కి గ్యాప్ తీసుకోక తప్పలేదు. సైరా సినిమా విడుదల కావడంతో రాంచరణ్ షూటింగ్ కి వెళ్తాడు అనుకునే టైం లో ఇప్పుడు మరొక హీరో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ కి కొద్దిరోజులు గ్యాప్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. 2020 జులై 30న ఈ సినిమా విడుదల చేస్తానని రాజమౌళి ప్రకటించాడు. మరి ఇన్ని ఆటంకాల మధ్య అనుకున్న సమయానికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా...? లేకపోతె బాహుబలి 2 కి పెట్టినట్టు రాజమౌళి దీనికి కూడా 'సారీ మీట్' పెడతాడా చూడాలి.