Begin typing your search above and press return to search.

తెల్ల పిల్లతో ఎన్టీఆర్ రొమాంటిక్ సాంగ్.. అదుర్స్ అంట!

By:  Tupaki Desk   |   29 May 2020 3:00 PM GMT
తెల్ల పిల్లతో ఎన్టీఆర్ రొమాంటిక్ సాంగ్.. అదుర్స్ అంట!
X
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్, ఎన్టీఆర్ జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా లాక్ డౌన్‌లోకి వెళ్లింది. అందుకే షూటింగు నిలిచిపోయింది. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఎవరికీ తెలీదు. రాజమౌళి ప్రతీ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య మంచి రొమాంటిక్ పాటలు సెట్ చేస్తుంటాడు. అయితే ఈ సినిమాలో ఆల్రెడీ రాంచరణ్ సరసన అలియాకి ఓ సాంగ్ ఉందని తెలిసిందే.

అలాగే మరి ఎన్టీఆర్ సరసన తెల్ల పిల్ల ఒలివియా మోరిస్ నటిస్తుండటంతో ఈ ఇద్దరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉండబోతుందని అభిమానులలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. అతడితో ప్రేమలో పడే బ్రిటిష్ అమ్మాయిగా ఒలివియా కనిపించనుందట. ఇక రాజమౌళి ఎన్టీఆర్ తో తీసిన అన్నీ సినిమాలలో మంచి రొమాంటిక్ సాంగ్స్ రూపొందించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ తో ఓ లవ్ ట్రాక్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ సాంగ్ ఈ సినిమాలోని అన్నీ పాటల్లో అద్భుతంగా ఉంటుందట. ఇప్పటికే కీరవాణి ఈ సాంగ్‌కు సంబంధించిన రికార్డింగ్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. మొత్తానికి ఆర్ఆర్ఆర్ లో ఇద్దరు హీరోలతో చెరో శృంగారభరిత సాంగ్ ఉంటుందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.