ఎన్టీఆర్ కి కోపం తెప్పించిన సుమ

Mon Feb 06 2023 09:19:01 GMT+0530 (India Standard Time)

NTR Serious On Anchor Suma Over Updates

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి దగ్గరగా ఉండటానికి సెలబ్రిటీలు ట్విట్టర్ లో అందుబాటులో ఉంటున్నారు. ఈ నేపధ్యంలో వారితో డైరెక్ట్ ఆక్సెస్ వారికి దొరికినట్లు అయ్యింది. దీంతో చీటికి మాటికి తమ అభిమాన హీరోలు లేదంటే నిర్మాతలు దర్శకులని ట్యాగ్ చేసి కొత్త సినిమా అప్డేట్ ఇవ్వండి అంటూ డిమాండ్ చేస్తూ ఉంటారు. ఈ రకమైన సంస్కృతి ఇప్పుడు ఎక్కువ అయిపొయింది. ముఖ్యంగా స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా స్టార్స్ కావడంతో సినిమాలని కథలని ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నారు.అలాగే కథల మీద దర్శకులు కూడా ఎక్కువ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంది. నిర్మాతలు వందల కోట్ల రూపాయిలు పెట్టుబడి పెడుతున్నప్పుడు దానికి తగ్గట్లుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇవన్ని ఉండటం వలన తమ అభిమాన హీరోల సినిమాలకి సంబందించిన అప్డేట్స్ ని రెగ్యులర్ గా ఇచ్చే పరిస్థితిలో దర్శకులు ఉండరు.

అయితే అభిమానులు మాత్రం ప్రతిరోజు అప్డేట్ ఇవ్వండి అంటూ డిమాండ్ చేస్తారు. ఇక ఏదైనా సినిమా ఫంక్షన్ కి వస్తే యాంకర్స్ కూడా ఆ హీరోతో మాట్లాడే సమయంలో అప్డేట్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు అంటూ మొదలు పెడతారు.

సంఘటన తాజాగా అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ గా తారక్ వచ్చాడు. అయితే దీనికి యాంకర్ గా ఉన్న సుమ మాట్లాడుతూ తనకి అలవాటైన పద్ధతిలో ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎన్టీఅర్ 30 అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇప్పుడు ఎన్టీఅర్ ఆ అప్డేట్ ఇచ్చేస్తాడు అంటూ మొదలు పెట్టింది. ఇక సుమ మాటలకి తారక్ స్టేజ్ మీదనే సీరియస్ లుక్ ఇచ్చాడు. అదే సమయంలో ఫ్యాన్స్ కి లేకపోయిన నువ్వే అడిగేలా ఉన్నావ్ అంటూ సీరియస్ గానే కౌంటర్ ఇచ్చాడు.

ఇక ఎన్టీఅర్ సీరియస్ లుక్ ఇచ్చే సమయంలో కళ్యాణ్ రామ్ అతని వైపు నవ్వుతూ కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ లుక్ తర్వాత తారక్ కొద్ది సేపు సినిమా గురించి మాట్లాడి తన ఎన్టీఆర్ 30 మార్చి 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఏప్రిల్ 5 2024న మూవీ రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. దీంతో కొరటాల సినిమాపై ఇన్ని రోజులు వచ్చిన రూమర్స్ కి చెక్ పడినట్లు అయ్యింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.