Begin typing your search above and press return to search.

నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ అలాంటి ప్లాన్ లో ఉన్నారా?

By:  Tupaki Desk   |   7 Jun 2023 9:28 AM GMT
నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ అలాంటి ప్లాన్ లో ఉన్నారా?
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా `దేవర`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో హృతిక్ రోషన్ `వార్ 2`తో తారక్ హిందీ చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆరంగేట్రం చేయ‌నున్నాడు. ఆ త‌ర్వాత కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా సినిమా చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు. అత‌డి లైన‌ప్ చూస్తుంటే ఏ ఇత‌ర టాలీవుడ్ టాప్ హీరోకి తీసిపోని రీతిలో ఉంది. ఎన్టీఆర్ పేరు ఇప్ప‌టికే పాన్ వ‌ర‌ల్డ్ రేంజులో మార్మోగుతోంది. ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత అత‌డు మ‌రో మెట్టు ఎక్కేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు.

అయితే ఇదే స‌మ‌యంలో అత‌డు మ‌రో తెలివైన ఎత్తుగ‌డ‌తో ముందుకు వ‌స్తున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. టాలీవుడ్ లో త‌న సోద‌రుడు క‌ళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ ని స్థాపించి వ‌రుస సినిమాలు నిర్మిస్తున్నారు. అదే త‌ర‌హాలో త‌న‌కో సొంత బ్యాన‌ర్ కావాల‌ని తార‌క్ భావిస్తున్నార‌ట‌. మునుముందు అన్న క‌ల్యాణ్ రామ్ తో క‌లిసి వ‌రుస చిత్రాల‌ను నిర్మించేందుకు త‌న బ్యాన‌ర్ ని జోడించాల‌ని భావిస్తున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనికోసం ఒక అద్భుత‌మైన టైటిల్ తో బ్యాన‌ర్ ని లాంచ్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. అలాగే ఎన్టీఆర్ బ్యాన‌ర్ లో తొలి సినిమా నేచుర‌ల్ స్టార్ నానితో ఉంటుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ అతి త్వరలో తన సొంత ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించి సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ హౌస్ ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి సినిమాలు చేస్తాడు! అంటూ గుస‌గుస‌లు వైర‌ల్ అవుతున్నాయి. సొంత బ్యాన‌ర్ల‌లో ప్ర‌తిభావంతులైన స్టార్ల‌ను ప్రోత్స‌హిస్తూ సినిమాలు తీయాల‌నేది అన్న‌ద‌మ్ముల‌ ఎత్తుగ‌డ అని తెలిసింది.

అయితే ప్ర‌స్తుతానికి ఇవ‌న్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. తార‌క్ బృందం అధికారికంగా ప్ర‌తిదీ వెల్ల‌డించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ కి తీరిక చిక్క‌నంత భారీ షెడ్యూల్ ఉంది. మ‌రో నాలుగైదేళ్లు కాల్షీట్లు దొర‌క‌డ‌మే క‌ష్టంగా మారింది. కానీ త‌న సాటి హీరోలు రామ్ చర‌ణ్‌- ప్ర‌భాస్- మ‌హేష్ సొంత బ్యాన‌ర్ల‌తో దూసుకుపోతున్నారు. కొత్త ప్ర‌తిభ‌ను వీరంతా ప్రోత్స‌హిస్తూ సినిమాలు తీస్తున్నారు. అదే తీరుగా త‌న‌ని తాను మ‌లుచుకోవ‌డం కోసం తార‌క్ స‌మాలోచ‌న జ‌రిపి అద‌నంగా స‌మ‌యం కేటాయించి శ్ర‌మించాల్సి ఉంటుంది.