బాబాయ్ అంటే గుండెల్లో అంత ప్రేమ!

Thu Oct 10 2019 13:32:46 GMT+0530 (IST)

NTR Effection on balakrishna

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంటారనేది అందరికీ తెలిసిందే. ఒక్క మాట అటూ ఇటూ మాట్లాడితే వివాదాస్పదం అవుతుందని ఎన్టీఆర్ కు తెలుసు కాబట్టి ఆచితూచి మాట్లాడతారు.  ఇంటర్వ్యూల సమయంలో కూడా తారక్ ఎంత షార్ప్ గా ఉంటారో గమనించవచ్చు.  అయితే ఎమోషనలై.. కన్నీరు పెట్టుకున్న తారక్ ను మనం చూడడం చాలా అరుదు.  రీసెంట్ గా సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అలాంటి సంఘటన గురించి వెల్లడించి అందరినీ సర్ ప్రైజ్ చేశారు.'అల్లరి రాముడు' షూటింగ్ సమయంలో బాబాయ్ బాలకృష్ణ అంటే తనకు ఎంత అభిమానం.. ప్రేమ అనేది తారక్ పరుచూరి గోపాలకృష్ణకు చెప్పారట. బాబాయ్ కి తనో డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పారట. "ఇప్పుడు బాలయ్య బాబు తో మాట్లాడతావా?" అని తారక్ ను అడిగారట గోపాలకృష్ణ. ఆమాట వినగానే తారక్ కళ్ళలో నీరు వచ్చేసిందట.  గోపాలకృష్ణ వెంటనే బాలయ్యకు కాల్ చేసి తారక్ తో మాట్లాడాలని రిక్వెస్ట్ చేశారట.  బాలయ్య సరే అని.. తారక్ తో మాట్లాడారట.  బాబాయ్ తో మాట్లాడుతున్నంతసేపూ తారక్ ఓ చిన్నపిల్లాడిలా ఏడుస్తూనే ఉన్నారట. బాబాయ్ - అబ్బాయ్ మొదటిసారి మాట్లాడుకున్న క్షణం అది.  

మరో సందర్భంలో కూడా తారక్ ఇలానే కంటనీరు పెట్టుకున్నారని వెల్లడించారు గోపాలకృష్ణ. 2001 లో సినీగోయర్ అవార్డుల ఫంక్షన్ జరిగితే నిర్వాహకులు బాలయ్య మెడలో తారక్ చేత పూలదండ వేయించారట.  ఆ సమయంలో కూడా తారక్ తన ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేకపోయారని వెల్లడించారు గోపాలకృష్ణ. ఎంతైనా బాబాయి.. పైగా ఫేవరెట్ హీరో.. ఆకాశమంత అభిమానం.. ప్రేమ ఉండడంతో ఆశ్చర్యం లేదు.