ఛలో దుబాయ్ అన్న యంగ్ టైగర్!

Mon Feb 11 2019 12:50:52 GMT+0530 (IST)

NTR Dubai Trip Viral In Social Media

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RRR షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.  ఇప్పటివరకూ జరిగిన షూటింగ్ లో రామ్ చరణ్ తో పాటుగా ఎన్టీఆర్ కూడా పాల్గొన్నాడు. ఈమధ్య చరణ్ కు సంబంధించిన సీన్లు మాత్రమే తెరకెక్కిస్తుండడంతో రాజమౌళి ఎన్టీఆర్ కు షూటింగ్ నుండి బ్రేక్ ఇచ్చాడట.  దీంతో ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మి ప్రణతి.. తనయుడు అభయ్ రామ్ తో కలిసి దుబాయ్ పయనమయ్యాడు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉండగా తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అయ్యాయి. ఇది జస్ట్ ఫ్యామిలీ వెకేషన్ మాత్రమే కాదట.. #RRR కు కావలిన కొంత స్పెషల్ ఎక్విప్ మెంట్ తో పాటుగా తన కాస్ట్యూమ్స్ కూడా షాపింగ్ చేస్తాడట. ఫ్యామిలీ ట్రిప్ ప్లస్ వర్క్..  అంటే టూ ఇన్ వన్ ట్రిప్ అన్నమాట.   ఎన్టీఆర్ మామూలుగానే తన షాపింగ్ దుబాయ్ లోనే చేస్తాడట.  ఈ సారి #RRR సినిమాలో తన పాత్రకు కావలిసిన దుస్తుల షాపింగ్ చేస్తుండడం విశేషమే.

ఈ సినిమా కథ బ్రిటిష్ కాలం నాటి నుండి ఇప్పటివరకూ సాగుతుందట.  పునర్జన్మ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో చరణ్.. ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్లను ఇంకా ఫైనలైజ్ చేయాల్సి ఉంది.