Begin typing your search above and press return to search.

దేవరపై ఆచార్య నీడ పడుతోందా?

By:  Tupaki Desk   |   27 May 2023 8:59 AM GMT
దేవరపై ఆచార్య నీడ పడుతోందా?
X
జూనియర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ ప్రస్తుతం దేవర మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ ఐలాండ్ నేపథ్యంలో ఈ మూవీ కథాంశం ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అలాగే చావంటే భయం లేని రాక్షసులని భయపెట్టిన ఒక వీరుడి కథ దేవర అని కొరటాల క్లారిటీ ఇచ్చారు. దీనిని బట్టి ఈ మూవీ ఎలా ఉండబోతోంది అనేది ఒక అంచనాకి రావొచ్చు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది. థర్డ్ షెడ్యూల్ ని తాజాగా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించే పనిలో కొరటాల ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబందించిన కొన్ని లీక్డ్ ఫోటోలు బయటకి వస్తున్నాయి. ఈ లీక్డ్ ఫోటోలు సినిమాపై కొత్త రూమర్స్ క్రియేట్ కావడానికి కారణం అవుతున్నాయి.

తాజాగా దేవర మూవీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ టెంపుల్ సెట్ వేసి అందులో యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఫోటోలు కాస్తా ఇప్పుడు వైరల్ అయ్యాయి. వీటిని చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు ఆచార్యకి లింక్ పెట్టి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆచార్య మూవీ కూడా దర్మస్తలి అనే ఇక ఫిక్షనల్ టెంపుల్ ని డిజైన్ చేసి దాని చుట్టూనే కథని నడిపించారు. అయితే ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఆచార్య మూవీ కొరటాల ఇమేజ్ ని కూడా భాగా డ్యామేజ్ చేసింది.

అయిన కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా ఏడాది పాటు వెయిట్ చేసి కొరటాలతో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళారు. ఈ నేపథ్యంలో కొరటాల శివ కూడా ఈ మూవీతో బౌన్స్ బ్యాక్ అవ్వాలనే కసితో వర్క్ చేస్తున్నారు. అయితే ఆచార్య తరహాలోనే దేవర మూవీలో కూడా టెంపుల్ సెట్, అందులో యాక్షన్ సీక్వెన్స్ అంటే ఏదో డౌట్ కొడుతుంది అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

అయితే ఆచార్య, దేవర కథల నేపథ్యంలో పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఆచార్యని ఒక ఆద్యాత్మిక కోణం నుంచి కొరటాల ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే దేవర మూవీ మాత్రం కంప్లీట్ గా యాక్షన్ బ్యాక్ మోడ్ లోనే ప్రెజెంట్ చేస్తున్నారు. రెండింటికి అస్సలు పోలిక ఉండే ఛాన్స్ ఉండదని తారక్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు.