Begin typing your search above and press return to search.

WOW: రామ్‌ను కాపాడేందుకు NTR వచ్చాడు!

By:  Tupaki Desk   |   27 Sep 2022 8:36 AM GMT
WOW: రామ్‌ను కాపాడేందుకు NTR వచ్చాడు!
X
ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ల‌గా నిలిచిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'..' క్లాసిక్ హిట్ 'సీతారామం' గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్నేహితుల కోసం రామ్ -భీమ్ పోరాటం ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. ప్రేమికుడి ప్రియురాలి కోసం భీమ్ చేసిన పోరాటం అంతే ఆస‌క్తిక‌రం. సీత‌ను రామ్ తో క‌ల‌ప‌డం కోసం భీమ్ తెగింపు ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది.

రామ్ క్షేమాన్ని ఉద్దేశించి సీతకు రాసిన లేఖ‌ను చూసి క‌న్నీళ్లు చెమ‌ర్చిన సీత రామ్ యోగ‌క్షేమాల గురించి ఎంత‌గా త‌పిస్తుందో తెర‌పై చూసాం. అలాగే సీతారామంలో సీత - రామ్ ల మ‌ధ్య అజ‌ర‌మార ప్రేమ క‌థ అంత‌కు మించిన క‌న్నీళ్లు తెప్పిస్తుంది. సీత కోసం రామ్ చూపించే ఆరాటం..ఆ క్ర‌మంలో రామ్ -సీతల మ‌ధ్య ప్రేమ‌ల లేఖల స్టోరీ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది.

స‌రిగ్గా ఇదే పాయింట్ ని బేస్ చేసుకుని మీమ‌ర్స్ ఓ రేంజ్లో రెండు సినిమాల్ని అద్భుతంగా రీ క్రియేట్ చేస్తున్నారు. రెండు సినిమాల ల‌వ్ స్టోరీల‌ను మిక్స్ చేసి మీమ‌ర్స్ ఓ స్పెష‌ల్ వీడియో రిలీజ్ చేసారు.

రెండింటిలోనూ రామ్ కోసం సీత రాసిన లేఖ‌ల్ని చ‌ద‌వ‌డం..ఒక‌ర్ని కాపాడ‌బోయి బంధీగా మార‌డం ఉంటాయి. ఇప్పుడు సీతారామం లో రామ్ ని కాపాడేందుకు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌చ్చిన‌ట్లు వీడియోలో రీ క్రియేట్ చేసారు.

త‌ను సేఫ్ గా ఉన్నాడ‌ని నిజం చెప్పండ‌ని సీతారామంలో సీత అంటే ... నా పాణం అడ్డు పెట్టైనా నీ రాముడ్ని నేను తొలుకొస్తా అంటాడు భీమ్. ఆ రెండు స‌న్నివేశాల సికింగ్ ఎంతో బాగా కుదిరింది.

ఎన్టీఆర్ వ‌స్తే ఎలా ఉంటుందో క్రియేటివ్ గా ఎడిట్ చేసారు. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. రియ‌ల్ క్రియేట‌ర్స్ ని మించి మీమ‌ర్స్ అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు నెటి జ‌నులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.