ఎన్టీఆర్ 30.. చర్చల్లోకి మరో ఇద్దరు!

Wed Sep 28 2022 21:05:02 GMT+0530 (India Standard Time)

NTR 30 Two more in talks keerthy suresh or rashmika mandanna

జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమా మొదలుపెట్టడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు అని అనిపిస్తోంది. ఒక విధంగా ఎన్టీఆర్ ఇంత ఆలస్యం చేయడానికి కారణం అయితే లేకపోలేదు. RRR సినిమా తర్వాత విడుదలయ్యే సినిమా కాబట్టి తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా సక్సెస్ అవ్వాలి అని ఎన్టీఆర్ ఆశపడుతున్నాడు.అయితే రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ప్రకారం అతని సినిమా తరువాత ఇప్పటికే రామ్ చరణ్ ఆచార్యతో డిజాస్టర్ అందుకున్నాడు. అందులోనూ కొరటాల శివ దర్శకుడు కావడం విశేషం. ఇప్పుడు అదే దర్శకుడితో ఎన్టీఆర్ కూడా సినిమా చేస్తున్నాడు కాబట్టి ఎంతో ఆలోచించి గాని నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టకూడదు అని డిసైడ్ అయ్యాడు.

పూర్తిస్థాయిలో బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమైతే గానే సినిమాను స్టార్ట్ చేయకూడదు అని అనుకుంటున్నారు. ఇక ఆ మధ్యలో ఎన్టీఆర్ లేవనెత్తిన కొన్ని డౌట్లను కూడా తీర్చడానికి కొరటాల శివ గంటల తరబడి స్క్రిప్ట్ పై కూర్చోవాల్సి వచ్చిందట. మొత్తానికి ఇటీవల ఫైనల్ నెరేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇంకా అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఇక హీరోయిన్స్ విషయంలో కూడా ముందుగానే ఒక నిర్ణయానికి వస్తే బెటర్ అని అనుకుంటున్నారట.

ఇక ప్రస్తుతం డిమాండ్ ను బట్టి అగ్ర హీరోయిన్స్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. మొదట బాలీవుడ్ లో కొంతమంది కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ వర్కౌట్ కాలేదట. ఇక ఇప్పుడు మరో ఇద్దరి పేర్లు చర్చల్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. పుష్ప సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న రష్మిక మందన్న అయితే బెటర్ అని మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది.

అలాగే మహానటి ఫేమ్ సురేష్ కూడా ఈ సినిమాకు కరెక్ట్ గానే సరిపోతుంది అని ఆలోచించారట. ఏది ఏమైనా కూడా ఇద్దరూ ఇప్పుడు మంచి స్టార్ హోదాతోనే ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ కు సరైన జోడిగా ఎవరో ఒకరిని ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక వాళ్ళు కుదరకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక ప్రముఖ హీరోయిన్ ని కూడా తీసుకువచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై ఫైనల్ క్లారిటీ ఎప్పుడు ఇస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.