Begin typing your search above and press return to search.

NTR 30: ఫైనల్ గా హీరోయిన్ ఓకే చెప్పేసింది!

By:  Tupaki Desk   |   6 Oct 2022 1:17 PM GMT
NTR 30: ఫైనల్ గా హీరోయిన్ ఓకే చెప్పేసింది!
X
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో రాబోయే సినిమా కోసం ఫ్యాన్స్ మొన్నటి వరకు చాలా ఆతృతగా ఎదురుచూశారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ప్రాజెక్టు నలువైపులా కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే అసలు ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ అప్పుడెప్పుడో జూలైలో మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత అప్పటికే కొంత నెగిటివ్ టాక్ అయితే వచ్చింది.

అయినప్పటికీ ఎన్టీఆర్ కొరటాల తప్పకుండా సక్సెస్ అవుతారు అని మరోవైపు నుంచి ఫ్యాన్స్ నమ్మారు. కానీ ప్రాజెక్టు మరింత ఆలస్యం అవుతూ ఉండడంతో కథ అంతగా కనెక్ట్ కాకపోయి ఉండవచ్చు అని అంతేకాకుండా కథలో కూడా చాలా మార్పులు చేస్తున్నారు అనే కథనాలకు ఫ్యాన్స్ కొంత సంతృప్తి చెందారు. అసలు ఈ ప్రాజెక్టు కోసం ఫ్యాన్స్ కోరుకున్నట్లే అనిరుధ్ రవిచంద్రన్ ను రంగంలోకి దింపడం కొంత కలిసి వచ్చే అంశం.

ఇక హీరోయిన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ అనే కామెంట్లు కూడా చాలానే వచ్చాయి. అయితే ఇప్పుడు దాదాపు హీరోయిన్ ఫిక్స్ అయింది అన్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. రీసెంట్గా రష్మిక మందన్న ముంబైలో థాంక్ గాడ్ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటూ ఉండగా మొత్తానికి ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాపై ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు ఒక వివరణ అయితే ఇచ్చింది.

ఇంకా అఫిషియల్ ప్రకటించలేదు కదా అప్పుడే ఫిక్స్ చేసేస్తారా అంటూ సోషల్ మీడియా కామెంట్స్ కూడా స్పందించింది. కానీ మొత్తానికి హీరోయిన్ గొడవ అయితే ముగిసినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు ప్రస్తుతం మిగతా టెక్నీషియన్స్ అలాగే క్యాస్టింగ్ విషయంలో కూడా తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక స్క్రిప్ట్ కూడా దాదాపు ఫినిష్ అయినట్లు సమాచారం. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టి సినిమాను వచ్చే ఏడాది చివరలో లేదా ఆ తర్వాత ఏడాది విడుదల చేయవచ్చు అని సమాచారం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.