Begin typing your search above and press return to search.

#NBK107 : అదిరిపోయే అప్‌డేట్‌ ఇదిగో

By:  Tupaki Desk   |   28 Sep 2022 2:30 PM GMT
#NBK107 : అదిరిపోయే అప్‌డేట్‌ ఇదిగో
X
నందమూరి బాలకృష్ణ 107వ సినిమా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. అయినా ఇప్పటి వరకు కూడా సినిమా యొక్క టైటిల్‌ ను దర్శకుడు గోపీచంద్‌ మలినేని రివీల్‌ చేయకుండా బాలయ్య అభిమానుల యొక్క బీపీ పెంచుతున్నాడు.

ఎప్పుడు.. ఎప్పుడు అని అడుగుతున్నా కొద్ది ఆలస్యం చేస్తున్నాడు. సినిమా గ్లిమ్స్.. టీజర్స్... పోస్టర్స్ వస్తున్నాయి కానీ టైటిల్‌ విషయంలో మాత్రం దర్శకుడు క్లారిటీ ఇవ్వక పోవడంతో బాలయ్య అభిమానులు ఒకానొక సమయంలో సహనం కోల్పోయి తీవ్ర స్థాయిలో సోషల్‌ మీడియా ద్వారా దర్శకుడిని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి.

సరైన సమయం కోసం వెయిట్‌ చేసిన దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఆ సమయం రానే వచ్చిందని టైటిల్‌ అనౌన్స్మెంట్‌ కు సిద్ధం అవుతున్నాడు. దసరా సందర్భంగా ఎన్‌ బీకే 107 సినిమా యొక్క టైటిల్‌ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. అంతే కాకుండా సినిమా విడుదల తేదీ విషయంలో ఆ రోజు క్లారిటీ వస్తుందని అంటున్నారు.

అక్టోబర్‌ 2 లేదా అక్టోబర్‌ 5వ తారీకున బాలయ్య సినిమా టైటిల్‌ మరియు రిలీజ్ డేట్‌ ల విషయంలో అభిమానులకు సర్‌ ప్రైజ్ ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్‌ 4వ తారీకున అన్‌ స్టాపబుల్‌ షో యొక్క ప్రెస్‌ మీట్‌ ఉంటుందట.

అప్పటి వరకు టైటిల్ ని ప్రకటించే ఉద్దేశ్యంతో దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఉన్నాడట. సినిమా ను నవంబర్ లేదా డిసెంబర్‌ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్‌ లో అఖండ సినిమా తో వచ్చి సూపర్ హిట్‌ దక్కించుకున్న బాలయ్య ఆ సెంటిమెంట్‌ తో ఈ సినిమాతో వస్తాడేమో అనే టాక్‌ కూడా వినిపిస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.