Begin typing your search above and press return to search.

#NBK107 : ప్లాన్‌ చేంజ్‌.. అమెరికా కాదు టర్కీ

By:  Tupaki Desk   |   6 July 2022 8:30 AM GMT
#NBK107 : ప్లాన్‌ చేంజ్‌.. అమెరికా కాదు టర్కీ
X
నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్‌ లుక్ మరియు టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో ఖచ్చితంగా బాలయ్య కు ఇది మరో అఖండ విజయాన్ని తెచ్చి పెడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

బాలయ్య అఖండ సినిమా తర్వాత వస్తున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఈ సినిమాలో లుక్‌ బాలయ్య అభిమానులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా మెప్పించే విధంగా ఉంది.

ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విదేశీ షెడ్యూల్ పూర్తి అయితే విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ వెయిట్‌ చేస్తున్నారట.

బాలయ్య 107 సినిమా కోసం అమెరికా వెళ్లేందుకు మొదట ప్లాన్ చేశారు. కాని గత కొన్ని రోజులుగా వీసా ఇష్యూ అవుతోంది. కొందరు యూనిట్‌ సభ్యులకు వీసా సమస్య రావడంతో పాటు ఇతర కారణాల వల్ల మొత్తానికి అమెరికా షెడ్యూల్‌ ను క్యాన్సిల్‌ చేశారనే వార్తలు వస్తున్నాయి. అమెరికాలో షూట్‌ చేయాలనుకున్న షెడ్యూల్‌ ను టర్కీ లో చేయబోతున్నారు.

అతి త్వరలోనే టర్కీ కి వెళ్లి షూట్‌ చేసుకు రాబోతున్నారు. బాలయ్య ఇటీవలే కరోనా నుండి తేరుకున్నారు. ఆయన తో హైదరాబాద్‌ లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. టర్కీ షెడ్యూల్‌ కోసం బాలయ్య కూడా సిద్ధం అవుతున్నాడు. యూనిట్‌ సభ్యులు అంతా కూడా టర్కీ ట్రిప్‌ కు సంబంధించిన ఏర్పాట్లలో మునిగి ఉన్నారట.

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో సినిమాను ఇదే ఏడాది దసరా లేదా దీపావళి ఆ రెండు కాదంటే అఖండ విడుదల అయినట్లుగా ఈ ఏడాది చివరి నెలలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత ఎఫ్ 3 దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య 108వ సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే.