Begin typing your search above and press return to search.
NBK X PSPK Part 2 ప్రోమో : పవన్ చేసిన, చేయబోతున్న రాజకీయం
By: Tupaki Desk | 5 Feb 2023 8:15 PMనందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 పవన్ మొదటి ఎపిసోడ్ లో సినిమాలు మరియు వ్యక్తిగత విషయాల గురించిన విషయాలతో సాగిన విషయం తెల్సిందే. పార్ట్ 2 లో పూర్తిగా రాజకీయాల గురించి మాట్లాడినట్లుగా తాజాగా విడుదల అయిన ప్రోమోను చూస్తూ ఉంటే అర్థం అవుతోంది.
ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ని బాలకృష్ణ పలు రాజకీయ సంబంధిత ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది. తన అభిమానులు ఎందుకు ఓట్లు వేయడం లేదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎలా విశ్లేషించాడు.. అలాగే తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా చెప్పబోతున్నట్లుగా ప్రోమో లో చూపించారు.
గత ఎపిసోడ్ లో సాయి ధరమ్ తేజ్ గెస్ట్ గా రాగా.. ఈ ఎపిసోడ్ లో హరి హర వీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్ గెస్ట్ గా వచ్చాడు.
ఆ సమయంలో బాలయ్య.. మా ఇద్దరితో వర్క్ చేశావు కదా ఎలా అనిపించింది అని ప్రశ్నించగా క్రిష్ సమాధానంగా.. సింహం మరియు పులి మధ్య తల పెట్టినట్లు ఉందని సరదాగా సమాధానం ఇచ్చాడు.
రాష్ట్రంలో నీకు అభిమాని కాని వారు లేరు.. వారి ఓట్లు అన్నీ నీకు ఎందుకు పడలేదు అనుకుంటున్నావు అంటూ పవన్ ను అడిగిన బాలయ్య ప్రశ్నకు సమాధానం ఏంటి అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పవన్ సినిమాలు మానేసి ప్రజా సేవకు ప్రాముఖ్యత ఇవ్వాలి అంటూ బాలయ్య అనగానే ఆడియన్స్ అంతా కూడా అవును అన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాల విషయంలో తన ఉద్దేశ్యం ఏంటి అనేది చెప్పగా దాన్ని సస్పెన్స్ గా ఉంచారు. మొత్తానికి ప్రోమో ఎపిసోడ్ 2 పై ఆసక్తిని పెంచింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.