Begin typing your search above and press return to search.

`అఖండ` వాయిదాల ప‌ర్వం..సంక్రాంతికేనా?

By:  Tupaki Desk   |   21 Oct 2021 5:22 AM GMT
`అఖండ` వాయిదాల ప‌ర్వం..సంక్రాంతికేనా?
X
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ` అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. `సింహా`..`లెజెండ్` త‌ర్వాత ఈ కాంబినేష‌న్ హ్యాట్రిక్ హిట్ ధ్యేయంగా ప‌ని చేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే భారీ అంచ‌నాల మ‌ధ్య `అఖండ` రిలీజ్ కాబోతుంది. `అఖండ‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని హ్యాట్రిక్ జోడీగా ప్రూవ్ చేయాల‌ని వెయిట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను తుది అంకానికి చేర్చారు. అయితే రిలీజ్ తేదీపై మాత్రం ఇంకా క్లారిటీ దొర‌కలేదు. ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ అనుకున్నారు గానీ పెండింగ్ ప‌నులు పూర్తికాక‌పోవ‌డంతో వాయిదా ప‌డింది. ఈ నేప‌థ్యంలో దీపావ‌ళి కానుక‌గానైనా బాల‌య్య అభిమానుల‌కు ట్రీట్ ఇవ్వాల‌ని భావించిన

అదీ వ‌ర్క‌వుట్ అయ్యేలా క‌నిపించలేద‌న్న‌ది తాజా స‌మాచారం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జాప్య‌మా? లేక రిలీజ్ కి మంచి ముహూర్తం ఇది స‌రి కాద‌ని వెన‌క్కి త‌గ్గుతున్నారా? అన్న‌ది క్లారిటీ లేదు గానీ తాజాగా మ‌రోసాని రిలీజ్ వాయిదా ప‌డిన‌ట్లు గుసగ‌సలు వినిపిస్తున్నా యి. న‌వంబ‌ర్ ని వ‌దిలేసి డిసెంబ‌ర్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ఆలోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే అప్ప‌టికి సంక్రాంతి పండుగ ఇంకా స‌రిగ్గా నెల రోజులు ఉంటుంది. సంక్రాంతి బాల‌య్య కి సెంటిమెంట్ కూడా. ఆ స‌మ‌యంలో రిలీజ్ అయితే భారీ విజ‌యం సాధిస్తుంద‌ని బాల‌య్య బ‌లంగా న‌మ్ముతారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి వాయిదా ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు అన్న టాక్ కూడా వినిపిస్తోంది.

ఇప్ప‌టికే కొంత మంది అగ్ర హీరోల చిత్రాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. అయినా బాల‌య్య వెన‌క్కి త‌గ్గే టైప్ కాదు. సై అంటే సై అనే ర‌కంగా కాబ‌ట్టి పోటీనే ఇష్ట‌ప‌డ‌తారు. స‌రిగ్గా మూడున్న‌రేళ్ల క్రితం బాల‌య్య న‌టించిన `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` మెగాస్టార్ చిరంజీవి న‌టించిన` ఖైదీ నెంబ‌ర్ 150`కి పోటీగా రిలీజ్ అయి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. రెండు చిత్రాలు రెండు రోజుల గ్యాప్ లోనే రిలీజ్ అయి బాక్సాఫీస్ వ‌ద్ద త‌ల‌ప‌డ్డాయి. రెండూ భారీ విజ‌యాలు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ ఈసారి సంక్రాంతికి ప‌రిస్థితి వేరుగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

సంక్రాంతి పోటీలో అంత వీజీ కాదు!

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాల‌న్నీ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి క్యూ క‌డుతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు అగ్ర హీరోల చిత్రాలు స‌హా అన్ని మ‌ల్టీస్టార‌ర్ లు కూడా 2022 జ‌న‌వ‌రిలో విడుద‌ల‌య్యేలా ప్లానింగ్ సాగుతోంది. అందులోనూ చాలా సినిమాలు సంక్రాంతి సీజ‌న్ టార్గెట్ గానే బరిలోకి దిగుతున్నాయి. దీనిలో భాగంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్-మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టారర్ `ఆర్.ఆర్.ఆర్` ఎట్ట‌కేల‌కు జ‌న‌వ‌రి 7న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది చివ‌ర్లో రిలీజ్ అవుతుందా? వ‌చ్చే ఏడాది మార్చి? అంటూ కొన్ని తేదీలు లీక్ అయిన‌ప్ప‌టికీ చివ‌రిగా జ‌న‌వ‌రిలోనే ఫిక్స్ అయింది. దీంతో మెగాస్టార్ న‌టిస్తున్న ఆచార్య సైతం ఫిబ్ర‌వ‌రికి వాయిదా ప‌డింది.

ఇక సంక్రాంతి బ‌రిలోనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న భీమ్లా నాయ‌క్.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న స‌ర్కార్ వారి పాట చిత్రాల రిలీజ్ ల‌ను ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పోటీ తీవ్రంగా ఉండ‌నుంది. అఖండ మూడు భారీ చిత్రాల‌తో పోటీప‌డుతూ సంక్రాంతి బ‌రిలో నెగ్గుకు రావాల్సి ఉంటుంది.