Begin typing your search above and press return to search.

NBK 108 అదిరిపోయే లుక్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

By:  Tupaki Desk   |   31 March 2023 2:01 PM GMT
NBK 108 అదిరిపోయే లుక్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
X
నటసింహం నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఎన్బీకే 108 గురించి అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా గురించి బాలయ్య ఫ్యాన్స్ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన కాజల్ తో పాటు శ్రీలీల కూడా కనిపించబోతున్నట్లు సమాచారం.

అయితే ఇది బాలకృష్ణ 108వ చిత్రం కావడంతో.. దీనికి ఎన్బీకే 108 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. షైన్ స్క్రీన్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు శరత్ కుమార్ కూడా ఉన్నారట. అయితే ఈ చిత్రంలో మరో హీరోయిన్ అంజలి కూడా కనిపించబోతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ఈ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. రాబోయే దసరా పండుగను పురస్కరించుకొని ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. "విజయదశమికి ఆయుధ పూజ" అని ప్రకటించారు. బాలకృష్ణ పోస్టర్‌లో చాలా కోపంగా కనిపిస్తున్నాడు. ఆయన పక్కనే కాళీ మాతను కూడా మనం చూడొచ్చు.

ఈ ఏడాది అక్టోబర్ 24వ తేదీన దసరా పండుగ అవుతోంది. అయితే అదే రోజు నటసింహం నందమూరి బాలకృష్ణ తన కొత్త సినిమాతో థియేటర్లలో అడుగు పెట్టనున్నారు. ప్రేక్షుకులందరినీ విపరీతంగా ఆకట్టుకునేందుకు చాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా... అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు డిక్టేటర్ చిత్రానికి ఆయన సంగీతం అందించినా... అఖండతో భారీ విజయం సాధించారు. అలాగే సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని చూసుకుంటున్నారు.

తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మరి చూడాలి బాలయ్య బాబు, అనిల్ రావుపూడి కాంబోలో రాబోతున్న ఈ చిత్రం ఏ రేంజ్ లో హిట్టు కొడుతుంది, ఏ మేర కలెక్షన్లను వసూలు చేస్తుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.