Begin typing your search above and press return to search.

#NBK 107 వేటకు జేగంట మోగించిన మైత్రి

By:  Tupaki Desk   |   10 Jun 2021 3:51 AM GMT
#NBK 107 వేటకు జేగంట మోగించిన మైత్రి
X
న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ- గోపిచంద్ మలినేని కాంబినేష‌న్ లో మైత్రి మూవీ మేకర్స్ ##NBK 107 హంట్ త్వరలో ప్రారంభం కానుంది. మాస్ డెమి గాడ్ బాల‌య్య‌.. మాస్ ప‌ల్స్ బాగా బాగా తెలిసిన గోపీచంద్ మలినేని కాంబినేష‌న్ అన‌గానే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అభిమానుల్లో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

ఇది ప‌క్కా మాస్ కమర్షియల్ ఎంట‌ర్ టైన‌ర్ కానుంది. క్రాక్ తో భారీ బ్లాక్ బస్టర్ ను అందించిన గోపీచంద్ మ‌లినేని బాలకృష్ణ కోసం శక్తివంతమైన స్క్రిప్ట్ ను రాశారు. క్రాక్ త‌ర‌హాలోనే ఈ కథను కూడా గోపీ నిజసంఘటనల ఆధారంగా సిద్ధం చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించేందుకు భారీ బ‌డ్జెట్ ని కేటాయిస్తోంది.

నేడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇంట్రో వీడియోతో ఎన్‌.బి.కె 107 ని అధికారికంగా ప్రకటించారు. నిజానికి బాలయ్య ఇమేజ్ కి త‌గ్గ‌ట్టే ఇంట్రోలో సింహం వేటాడేందుకు సిద్ధ‌మ‌వుతోందని రివీల్ చేశారు. సింహం నడిచేప్పుడు అందులో బాలకృష్ణ ముఖాన్ని చూడవచ్చు. ఈ చిత్రంలో బాలకృష్ణ శక్తివంతమైన పాత్రలో న‌టిస్తున్నార‌ని చెప్పేందుకే అలా సింబాలిక్ గా ప్ర‌ద‌ర్శించారు. ఎస్.ఎస్.థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

# NBK107 హంట్ స్టార్ట్స్.. షూటింగ్ త్వరలో ప్రారంభం కాగానే ఇత‌ర వివరాల్ని మేకర్స్ వెల్ల‌డిస్తారు. ఇతర తారాగణం సిబ్బంది వివ‌రాలు చెబుతారు. మైత్రి బ్యాన‌ర్ లో నవీన్ యెర్నేని- వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.