బాలయ్య తగ్గేదేలే..టర్కీ షెడ్యూల్ సర్వం సిద్దం!

Mon Aug 15 2022 08:00:01 GMT+0530 (IST)

NBK 107 Movie Shoot In Turkey

ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాణం బంద్ కావడంతో హీరోలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా స్టార్ హీరోలందరూ విరామంలో ఉన్నారు. ఇండస్ర్టీలో నెలకొన్న సమస్యలన్ని ఓ కొలిక్కి వస్తే తప్ప షూటింగ్ ప్రారంభించే పరిస్థితి లేదు.  ఈ సమస్యలకి ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో క్లారిటీ లేదు. అయినా నటసింహ బాలకృష్ణ తగ్గేదేలే అంటూ రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నారు.ప్రస్తుతం  బాలయ్య కథనాయకుడిగా 107వ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తిచేసారు.  మెజార్టీ పార్ట్ దాదాపు పూర్తయింది.  దీంతో తదుపరి షెడ్యూల్ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని బాలయ్య కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూనిట్ టర్కీ లో ఓ షెడ్యూల్ కి రంగం సిద్దం చేస్తుంది.

ఆగస్టు  27 నుంచి టర్కీలో ఏకధాటిగా షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. దీనిలో భాగంగా యూనిట్ అంతా ఈనెల 24న టర్కీ ప్లైట్ ఎక్కనున్నారు. ఈ షెడ్యూల్ కి సంబంధించి ఎలాంటి మార్పులు చేయోద్దని బాలయ్య  యూనిట్ ని కోరినట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేసే ఆలోచనలో నిర్మాతలు ఉండటంతోనే బాలయ్య సూచించినట్లు తెలుస్తోంది.

విదేశీ  షెడ్యూల్ కాబట్టి వాయిదా పడే అవకాశం ఉండదు. కేవలం యూనిట్ కి సంబంధించిన కీలక సభ్యులు మినహా ఎవరూ ఔట్ డోర్ షూటింగ్ కి  వెళ్లరు. కాబట్టి ఈ షెడ్యూల్ యధావిధిగా జరిగిపోతుంది. ఈలోగో ఇండస్ర్టీ సమస్యలు కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సినిమాకి సంబంధించి అన్ని పనులుకున్న అనుకున్నట్లు గనుక జరిగితే డిసెంబర్ 2న చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.

అలా కాకుండా షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం ఏర్పడితే గనుక వచ్చే ఏడాది  సంక్రాంతికే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు బాలయ్య అనీల్ రావిపూడి దర్శకత్వంలో 108వ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇదే ఏడాది షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.

కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆషెడ్యూల్  లో మార్పులు జరిగే అవకాశం  ఉందని సమాచారం అందుతోంది. ఇంకా బాలయ్య తో సినిమాలు చేయడానిక ఇపలువురు స్టార్ డైరెక్టర్లు సైతం క్యూలో ఉన్నారు.  `అఖండ` సక్సెస్ తో బాలయ్య ఇమేజ్ రెట్టింపు అయింది. పాన్ ఇండియా కంటెంట్ తో సినిమాలు చేయాలని ఉత్సాహం చూపిస్తున్నారు.