Begin typing your search above and press return to search.

మైత్రీ మూవీస్‌.. ఇవి అవసరమా?

By:  Tupaki Desk   |   27 May 2023 3:22 PM GMT
మైత్రీ మూవీస్‌.. ఇవి అవసరమా?
X
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న బడా ప్రొడక్షన్ హౌస్‌లలో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. 'శ్రీమంతుడు' సినిమాతో మొదలైన ఈ సంస్థ ప్రస్థానం.. అప్పటి నుంచి విజయవంతంగా సాగిపోతోంది. దీంతో వీళ్లు ఎన్నో భారీ ప్రాజెక్టులను చేసుకుంటూ వెళ్తోన్నారు. ఫలితంగా నిర్మాతలు ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకోవడంతో పాటు కొన్ని కోట్లలో లాభాలను కూడా సాధిస్తున్నారు.

మంచి టేస్ట్ ఉన్న ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. ఇటీవలే డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం మొదలు పెట్టింది. గత సంక్రాంతికి థియేటర్ల వివాదం రేగడంతో ఈ సంస్థ స్వయంగా తమ నిర్మాణంలో వచ్చిన 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' చిత్రాలను విజయవంతంగా రిలీజ్ చేసింది. ఈ రెండూ హిట్ అవడంతో భారీ లాభాలను అందుకుంది.

సినీ రంగంలో ఎంతటి అనుభవం ఉన్నా అప్పుడప్పుడూ ఎదురు దెబ్బలు తగలడం మామూలు విషయమే. కానీ, సవ్యంగా సాగిపోతోన్న ప్రయాణాన్ని ముల్ల బాటలుగా మార్చుకోడానికి కొన్ని తప్పులు చాలు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. అనవసరమైన ప్రయోగాలు చేసి మంచి పేరు పోగొట్టుకోవడంతో పాటు నష్టాలను కూడా ఎదుర్కొంటోంది.

ఆ మధ్య వరుస హిట్లు కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. కల్యాణ్ రామ్ 'అమిగోస్'తో భారీ నష్టాలను చవి చూసింది. కానీ, ఈ చిత్రం వల్ల మంచి ప్రయత్నం చేశారని పేరు వచ్చింది. అయితే, ఆ తర్వాత వీళ్లు విడుదల చేసిన 'మీటర్' మాత్రం భారీ నష్టాలను మిగిల్చింది. అదే సమయంలో ఈ సంస్థ విమర్శలను కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఇక, ఇప్పుడేమో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ 'సత్తిగాని రెండెకరాలు' అనే సినిమాను నిర్మించింది. ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ చిత్రం కూడా ఆశించిన రీతిలో టాక్‌ను సొంతం చేసుకోలేదు. ఇలా అనవసర తప్పుల వల్ల ఈ సంస్థ రెప్యూటేషన్ పాడయ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫ్యూచర్‌లోనూ ఇలాంటి ప్రయత్నాలే చేస్తే వీళ్లకు పేరు, డబ్బు పరంగా మరింత నష్టం జరిగే ఛాన్స్ ఉంది.