Begin typing your search above and press return to search.

క్లిష్ట‌మైన టాస్క్..నేర్పుతో సాధించారు!

By:  Tupaki Desk   |   30 Jan 2023 8:00 PM GMT
క్లిష్ట‌మైన టాస్క్..నేర్పుతో సాధించారు!
X
బిగ్ స్టార్ మూవీని హ్యాండిల్ చేయ‌డం చాలా క‌ష్టం.. మెంట‌ల్ టెన్ష‌న్ ని ప‌క్క‌న పెట్టి ఎత్త ఒత్తిడి వున్నా స‌రే చ‌క్క‌ని ప్లానింగ్ తో అన్ని వ్య‌వ‌హారాల్ని స‌మన్వ‌యం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి వుంటుంది. అది చాలా సంర్భాల్లో ఇబ్బందుల్ని సృష్టించ‌డం తెలిసిందే. ఎంత ప్లానింగ్ బాగున్నా స‌రే కొంత మంది సినిమా రిలీజ్ ద‌గ్గ‌రికి వ‌చ్చేసే స‌రికి పానిక్ అవుతూ చేయాల్సిన ప్ర‌మోష‌న్స్ ని చేయ‌లేక‌పోతారు. అనుకున్న విధంగా కొన్ని చేయ‌లేక‌పోతారు.

అదే ఒకే స‌మ‌యంలో ఇద్ద‌రు అగ్ర‌హీరోల‌తో సినిమాలు.. వాటిని ఒకేసారి ఒకే సీజ‌న్ లో హోరా హోరీగా రిలీజ్ చేయాలంటే ప్రొడ్యూస‌ర్స్ కి అది మామూలు టాస్క్ కాదు. ఏ చిన్న త‌ప్పు దొర్లినా..ఇద్ద‌రు హీరోల్లో ఏ ఒక్క‌రికి అయినా ప్ర‌ధాన్య‌త త‌గ్గినా ఫ్యాన్స్ చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. పెద్ద గంద‌ర‌గోళం మొద‌ల‌వుతుంది. చేయాల్సిన ప‌ని ఎక్క‌డో డీవేట్ అయిపోయి ముందు ఫ్యాన్స్ కోసం ఏం చేయాలా? అనే కంగారు ప‌డాల్సి వ‌స్తుంది.

అయితే ఇలాంటి క్లిష్ట‌మైన టాస్క్ ని నేర్పుతో సాధించారు.. శ‌భాష్ అనిపించారు. మ‌రి కొంత మంది మేక‌ర్స్ కి ఆద‌ర్శంగా నిలిచారు. వారే మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు న‌వీన్ యెర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్. వీరిద్ద‌రూ సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించి అసాధ్యం అనుకున్న టాస్క్ ని సుసాధ్యం చేసి చూపించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నంద‌మూరి బాల‌కృష్ఱ క‌థానాయ‌కుడిగా 'వీర సింహారెడ్డి', మెగాస్టార్ చిరంజీవితో 'వాల్తేరు వీర‌య్య‌' సినిమాల‌ని నిర్మించారు.

ఈ రెండు సినిమాల‌ని ఒక్క రోజు లేడాతో సంక్రాంతి బ‌రిలో విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా ఈ రెండింటిని నైజాంలో వీరే స్వ‌యంగా రిలీజ్ చేయ‌డం మ‌రో విశేషం. మూడు ద‌శాబ్దాలుగా మెగా వ‌ర్సెస్ నంద‌మూరి న‌డుస్తోంది. ఇది తెలిసి కూడా ఎక్క‌డా ఎలాంటి త‌ప్పు దొర్ల‌కుండా, అభిమానులు ఏ విష‌యంలోనూ హ‌ర్ట్ కాకుండా చ‌క్క‌ని ప్లానింగ్ తో మైత్రీవారు ఈ రెండు సినిమాల‌ని రిలీజ్ చేసిన తీరు అభినంద‌నీయం.

ఇదిలా వుంటే వీరు రిలీజ్ చేసిన ఈ రెండు సినిమాల‌లో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'వాల్తేరు వీర‌య్య' ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌సూళ్ల‌ ప‌రంగా రికార్డులు సృష్టించింది. 200 కోట్ల‌కు పైగా ఇప్ప‌టికే వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంక్రాంతి విజేత‌గా నిలిచింది. అయినా స‌రే బాల‌య్య ఫ్యాన్స్‌, మెగా ఫ్యాన్స్ ఇప్ప‌టికీ సామ‌ర‌స్యంగా వుంటూ త‌మ హీరోల‌కు, మైత్రీ మూవీ మేక‌ర్స్ వారికి స‌హ‌క‌రిస్తుండం విశేషం.

మామూలుగా అయితే మా హీరో సినిమా వ‌సూళ్లు చిరు సినిమా స్థాయిలో లేవ‌ని, అ విష‌యంలో మేక‌ర్స్ జాగ్ర‌త్తులు తీసుకోలేద‌ని కామెంట్ లు చేయోచ్చు కానీ రెండు సినిమాలు చూసిన అభిమానులు ఏ సినిమా సంక్రాంతి విజేత‌నో తేల్చేసి కూల్ గా ఇద్ద‌రు హీరోల స‌క్సెస్ ల‌ని ఎంజాయ్ చేస్తున్నారు. దానికి మూవీల‌ రిలీజ్ కు ముందు అభిమానుల‌తో మైత్రీ వారు నిర్వ‌హించిన మీటింగ్ లే కార‌ణం అని తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.