మా ఇంట్లోవాళ్లు నన్ను వదిలేశారు.. నా కూతురు నన్ను జూలో వింత జీవిలా చూస్తుంది!!-ఆర్జీవీ

Thu Jun 10 2021 18:00:01 GMT+0530 (IST)

My family has abandoned me My daughter sees me as a strange creature in the zoo RGV

ముంబై నుంచి హైదరాబాద్ కి బేస్ క్యాంప్ ని మార్చేసిన ఆర్జీవీ ఆ తర్వాత డీగ్రేడ్ సినిమాలతో ప్రయోగాలు చేయడం అభిమానులకు నచ్చని సంగతి తెలిసిందే. ఆయన తన స్థాయికి తగ్గ సినిమాలు చేయడం లేదని స్థాయికి తగ్గట్టు ప్రవర్తించడం లేదని విమర్శలున్నాయి. ఇటీవల కొందరు హాట్ గాళ్స్ ని పాపులర్ చేసేందుకు డీ కంపెనీ పేరుతో వరుస ఫోటోషూట్లను రిలీజ్ చేయడం తెలిసినదే. ఈ కరోనా కష్టకాలంలో సదరు హీరోయిన్ల సినిమాలు రిలీజ్ లకు తేవడం సమస్యాత్మకంగా మారింది. ఆర్జీవీ తెరకెక్కించిన అరడజను సినిమాలు ఇంకా రిలీజ్ లకు నోచుకోని సన్నివేశం కనిపిస్తోంది. మరోవైపు ఓటీటీ వేదికలపైనా ఆర్జీవీ ప్రయోగాల గురించి తెలిసినదే.ఆ క్రమంలోనే తనను తన సినిమాల్ని తన కథానాయికల్ని లైమ్ లైట్ లో ఉంచేందుకే ఆర్జీవీ చేస్తున్న చిలిపి పనులు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. ఇంతకుముందే అతడు హీరోయిన్ తొడ భాగంలో ముద్దాడుతూ కనిపించాడు. దానిపై తీవ్రమైన ట్రోల్స్ ఎదురయ్యాయి. ఒక హాట్ యాంకర్ తనను పెళ్లాడేస్తానని అంటే ఆమె అందాన్ని పొగిడేశాడు.

తాజాగా ఆర్జీవీ ప్రతి యాక్టివిటీపైనా కుటుంబ సభ్యులు ఏమని అనుకుంటారు? ఎలా స్పందిస్తారు? అన్నది.. ఆయననే ఓ నెటిజన్ అడిగారు. దానికి అతడు ఎంతో నిజాయితీగా సమాధానమిచ్చారు.  ``నా కుటుంబం చాలా కాలం క్రితం విడిచిపెట్టింది. వారు పెద్దగా బాధపడటం లేదు. నేను కోరుకున్నది చేయటానికి వారు నన్ను విడిచిపెట్టారు. నేను జూలో ఉండే జీవిలా వింతగా ఉన్నానని నా కుమార్తె భావిస్తుంది`` అంటూ సూటిగా మ్యాటర్ కి వచ్చేశారు ఆర్జీవీ.