11 రోజుల్లోనే `బిజినెస్ మేన్` పని ఫినిష్!

Fri Jan 14 2022 05:00:01 GMT+0530 (IST)

Music Director Thaman About Businessman Movie

పోకిరి తర్వాత దశాబ్ధ కాలానికి మళ్లీ పూరి బిజినెస్ మేన్ లాంటి మాస్ యాక్షన్ చిత్రంతో తనదైన యూనిక్ నెస్ చూపించారు. ఇక ఈ మూవీలో మహేష్ ఎంతో ఎనర్జిటిక్ గా నటించి సిసలైన బిజినెస్ మేన్ అనిపించాడు. ఈ మూవీలో మాస్ యాక్షన్ సన్నివేశాలతో పాటు పాటలు ఆర్.ఆర్. కి అంతే గొప్ప పేరొచ్చింది. ముఖ్యంగా ఎస్.ఎస్. థమన్ పనితనానికి మంచి మార్కులే వేశారు క్రిటిక్స్... ప్రేక్షక జనం.మహేష్ బాబు బిజినెస్మెన్ గురించి థమన్ తాజాగా ఒక రహస్యాన్ని బయటపెట్టాడు. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ బిజినెస్ మేన్ విడుదలై నేటితో దశాబ్దం పూర్తి చేసుకుంది. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రానికి సంగీతం అందించిన తమన్ ఎమోషనల్ అయ్యారు. ``నా కెరీర్లో అత్యంత వేగంగా మ్యూజిక్ కంపోజిషన్ పూర్తి చేసిన సినిమా `బిజినెస్ మెన్` అని థమన్ చెప్పారు. కేవలం 11 రోజుల్లోనే పని పూర్తయిందని వెల్లడించారు.

నిజానికి థమన్ ఎంత స్పీడ్ గా పని చేశాడో అంతే గొప్పగా పాటలు కుదిరాయి. రీరికార్డింగ్ సినిమా రేంజును కూడా అంతే ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ విజయంలో యువ సంచలనం థమన్ అందించిన పాటలు -బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం సర్కార్ వారి పాట చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ తో మునముందు వరుస చిత్రాలకు సంతకాలు చేయనున్నాడు. పవన్ కల్యాణ్ సహా అగ్ర హీరోలందరితో థమన్ పని చేస్తున్న సంగతి తెలిసిందే.