Begin typing your search above and press return to search.

ట్రెండింగ్ హీరోను పట్టేసిన మురుగదాస్

By:  Tupaki Desk   |   24 Jan 2023 10:00 AM GMT
ట్రెండింగ్ హీరోను పట్టేసిన మురుగదాస్
X
కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లో క్రేజ్‌ తెచ్చుకుంటున్న హీరో శివకార్తికేయన్‌. ‘రెమో’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శివ కార్తికేయన్ ఆ సినిమాతో ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యాడు. ఆ తర్వాత తీసిన.. ‘డాక్టర్‌’, ‘డాన్‌’ వంటి సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. ఇక ఇటీవలే ఈయన నటించిన ‘ప్రిన్స్‌’ రిలీజై యావరేజ్‌గా నిలిచింది. ఈ చిత్రానికి జాతిరత్నాలు ఫేం అనుదీప్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు హీరో తమిళ స్టార్ డైరెక్టర్ తో సినిమా తీయబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం. ఆయన ఎవరో కాదు ఏ ఆర్ మురుగదాస్. మురుగదాస్ తొలి చిత్రం విజయ్ కాంత్ తో తీసిన రమణ. ఆ తర్వాత సూర్య హీరోగా నటించిన గజిని సినిమాకి దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్ గా మారారు.

విజయ్ హీరోగా కత్తి, తుపాకీ, సర్కార్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ చిత్రాలకు మురగదాస్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈయన చివరగా రజనీకాంత్ హీరోగా దర్బార్ చిత్రం తీశారు. అయితే ఇది బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడలేదు. దీంతో మురుగదాస్ పని అయిపోయింది అని అంతా అనుకున్నారు.

ఆ తర్వాత కొన్ని రోజులకి విజయ్ 65వ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు కానీ అది ఎందుకో ఆగిపోయింది. దర్బార్ రజనీకాంత్ తో తీసిన దర్బార్ తర్వాత ఆయన ఏ చిత్రం చేయలేదు. ఇటీవల త్రిష రాంగి అనే చిత్రంలో నటించిన ఈ చిత్రానికి మురుగ దాస్ కథ అందించడం విశేషం. అయితే కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఇప్పుడు మురగదాస్ ఈ ట్రెండింగ్ హీరో శివకార్తికేయంతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీన్ని లైట్ హౌస్ మూవీ సంస్థ నిర్మించినట్లు నిర్మించనున్నట్లు సమాచారం.

అయితే దీనికి సంబంధించి అధికార ప్రకటన అయితే ఇంకా వెలవడ లేదు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అనుకుంటున్నారు. ఏది ఏమైనా మళ్లీ మురగదాస్ ఈ హీరోతో హిట్ కొట్టాలని అభిమానుల ఆశిస్తున్నారు. ప్రస్తుతం శివకార్తికేయన్‌ ‘మహావీరుడు’ సినిమా చేస్తున్నాడు. మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటుంది.తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెరకెక్కి్స్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.