Begin typing your search above and press return to search.

మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చక్రవ్యూహం - ది ట్రాప్

By:  Tupaki Desk   |   8 Jun 2023 10:22 AM GMT
మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చక్రవ్యూహం - ది ట్రాప్
X
"చక్రవ్యూహం - ది ట్రాప్" సినిమా మర్థర్-మిస్టరీ క్రైమ్-థ్రిల్లర్ గా రూపొందింది. ఈ సినిమా పోస్టర్‌ మొదట్లోనే ఓ వర్గం ఆడియెన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఇక దివంగత సూపర్‌స్టార్ కృష్ణ గారి చేతుల మెదగానే ఆ పోస్టర్ ను అప్పట్లో విడుదల చేశారు. ఇక సినిమా ట్రైలర్‌ను మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆవిష్కరించారు.

సినిమా ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాలో మంచి టాలెంటేడ్ నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో నటించడం జరిగింది. చక్రవ్యూహం సినిమాలో టాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ ప్రముఖ పాత్రలో నటించారు. ఎన్నో విభిన్నమైన సినిమాల్లో విలన్ గా, హీరోగా అలాగే సపోర్టింగ్ రోల్స్ చేసిన అజయ్ ఈ సినిమాలో కూడా విభిన్నమైన పాత్రలో నటించారు. చాలా కాలం తరువాత అజయ్ మరింత డిఫరెంట్ రోల్ చేశాడు అని చెప్పవచ్చు.

ఇక సహస్ర క్రియేషన్స్ బ్యానర్ ద్వారా చక్రవ్యూహం సినిమాను నిర్మించారు. బేబీ అన్వీస్ సమర్పణలో చేట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సావిత్రి హ్యాండిల్ చేసిన ఈ సినిమా నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌గా ఉన్నాయి. సినిమా కంటెంట్ కు తగ్గట్టుగానే ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నట్లు ట్రైలర్ ద్వారా అర్ధమయ్యింది.

సినిమా మొత్తం క్వాలిటీగా ఉన్నట్లు ప్రశంసలు అందాయి. ఇక వారి క్యారెక్టర్స్ లలో నటీనటులు అద్భుతంగా నటించారు. దర్శకుడు మధుసూదన్ స్క్రీన్‌ప్లేతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. చాలా చోట్ల రైటింగ్ షార్ప్ గా ఉంది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ఇంటెన్సిటీని పెంచుతుంది. మంచి థ్రిల్లింగ్ సీన్స్ కు మ్యూజిక్ బాగానే హెల్ప్ అయ్యింది.

ఇక మొత్తానికి "చక్రవ్యూహం - ది ట్రాప్" ప్రేక్షకుల నుండి సానుకూల స్పందనలను అందుకుంది. బలమైన పాత్రలతో ఆకర్షణీయమైన కథాంశం సినిమా విజయానికి దోహదపడ్డాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు.


మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ థ్రిల్లర్‌ని మీ సమీప థియేటర్లలో చూడండి.