అంతా బాగానే ఉంది.. సీతారామం బ్యూటీ క్లారిటీ

Fri Mar 31 2023 12:25:44 GMT+0530 (India Standard Time)

Mrunal Thakur Responds on Her Mental State

బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన విషయం తెలిసింది. మొదటి సినిమాతోనే తెలుగు లో స్టార్ హీరోయిన్స్ సరసన నిలిచిన మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం అటు నార్త్ తో పాటు సౌత్ లో వరుసగా సినిమాలు చేస్తోంది.హీరోయిన్ గానే కాకుండా ప్రత్యేక పాత్రల్లో మరియు ఐటెం సాంగ్స్ లో కూడా ఈ ముద్దుగుమ్మ అలరిస్తున్న విషయం తెలిసింది. ఇలాంటి సమయంలో మృణాల్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పోస్ట్ చూసి చాలా మంది మృనాల్ మానసిక సమస్యలు ఎదుర్కొంటుందని భావించారు.

మరికొందరు ఆమె కెరీర్ ఆరంభంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా భావిస్తున్నారు. మొత్తానికి ఆమెకు మానసిక సమస్యలు చాలానే ఉన్నాయని ఆ పోస్ట్ ద్వారా తెలుస్తోందని ఎవరికి తోచిన విధంగా వారు రకరకాలుగా అర్థం చేసుకున్నారు. తాజాగా ఆ పోస్ట్ విషయమై మృణాల్ ఠాగూర్ స్పందించింది.

తనకు అంతా బాగానే ఉందని.. తన మానసిక పరిస్థితి బాగానే ఉందని పేర్కొంది. అంతే కాకుండా తాను డిప్రెషన్ లో లేనని కూడా క్లారిటీ ఇచ్చింది. తన చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు చూచి అలాంటి పోస్టు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అంతే కాకుండా కొన్ని విపత్కర సమస్యలు ఎదుర్కొన్నట్టుగా కూడా మృణాల్ పేర్కొంది.

సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన విషయం పట్ల క్లారిటీ రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక మృణాల్ నానితో ఒక సినిమాను చేసిన విషయం తెలిసిందే.

ఇక బాలీవుడ్ లో రెండు మూడు సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తోంది. మొత్తానికి బిజీ బిజీగా ఉన్నా మృణాల్ అంతా బాగానే ఉందంటూ క్లారిటీ ఇవ్వడం తో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.       


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.