అప్పుడు సినిమాలు వద్దన్న అమ్మానాన్న ఇప్పుడు...!

Sat Apr 01 2023 06:00:02 GMT+0530 (India Standard Time)

Mrunal Says That She Did Not Have Any Support Then!

సీతారామం సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ నార్త్ మరియు సౌత్ లో వరుసగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. నానికి జోడీగా ఒక సినిమాలో నటిస్తున్న మృణాల్ మరో వైపు హిందీలో కూడా సినిమాల్లో నటిస్తోంది. వెండి తెరతో పాటు బుల్లి తెరపై కూడా సందడి చేస్తున్న ఈ అమ్మడు తాజాగా ఒక కార్యక్రమంలో తన వ్యక్తిగత జీవితం మరియు కెరీర్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నానంటే కచ్చితంగా నా తల్లిదండ్రులే. యాక్టింగ్ చేయాలని భావించిన సమయంలో వారు మొదట నో చెప్పారు. సినిమాలు.. సీరియల్స్ అవసరం లేదన్నారు. ఇండస్ట్రీ గురించి వారికి ఉన్న భయం కారణంగా మొదట వారు అలా అన్నారు. అయితే తల్లిదండ్రులుగా వారు నా ఇష్టం ను కాదనలేక పోయారు.

వారి ప్రోత్సాహంతోనే టీవీ సీరియల్స్ లో మంచి పాత్రలు చేస్తూ మరాఠీ చిత్రంలో హీరోయిన్ గా పరిచయం అయ్యాను. నేను కెరీర్ ఆరంభించినప్పటి నుండి కూడా వారు నా విషయంలో గర్విస్తూనే ఉన్నారు. వారి ప్రోత్సాహం తో నేను కూడా ముందుకు సాగుతున్నాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

మనం లో గా ఉన్న సమయంలో ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుంటుందని అనుకుంటాం. అలాంటి సమయంలో ప్రోత్సాహం లభించకుంటే చాలా బాధగా ఉంటుందని పేర్కొంది.

ప్రోత్సాహం లేనంత మాత్రాన విశ్వాసం కోల్పోకుండా ప్రయత్నించాలని కూడా పేర్కొంది. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే నాని తో ఒక సినిమా చేయడంతో పాటు తెలుగు లో రెండు మూడు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

అతి త్వరలోనే హిందీలో కూడా ఈమె సినిమా రాబోతుంది. బుల్లి తెరపై కూడా అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో సందడి చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.