వీడియో: డ్యాన్సింగ్ సరే.. ఈసారైనా..?

Mon Jan 21 2019 21:55:11 GMT+0530 (IST)

కింగ్ నాగార్జున వారసుడిగా బరిలో దిగిన అఖిల్ అక్కినేని లెగసీని ముందుకు తీసుకెళతాడా? లేదా?  సోదరుడు నాగచైతన్యతో పోటీపడుతూ వరుసగా ఒకదానితో ఒకటిగా సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజయ్యాయి. అఖిల్ - హలో చిత్రాల ఫలితం ఎలా ఉన్నా.. అఖిల్ ట్యాలెంటు గురించి ఎవరూ వంక పెట్టలేదు. మంచి డ్యాన్సర్.. నటుడిగా మెరుగులు దిద్దుకునేందుకు చాలానే ఛాన్స్ ఉందని ప్రశంసలు దక్కాయి.అఖిల్ హలో చిత్రాల్లో డ్యాన్సింగ్ స్టార్ గా ల్యాండ్ మార్క్ స్టెప్పులతో అలరించాడు ఈ అక్కినేని కుర్రాడు. మరోసారి `మిస్టర్ మజ్ను`తో డ్యాన్సుల్లో మెరుపులు మెరిపించబోతున్నాడని తాజాగా రిలీజైన ప్రోమోలు వీడియోలు చెబుతున్నాయి. ఇప్పటికే టీజర్ - ట్రైలర్ - సాంగ్ టీజర్ లలో అఖిల్ డ్యాన్సులు ఆకట్టుకుంటున్నాయి. కోపంగా కోపంగా .. అంటూ ఓ సాంగ్ బిట్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో అఖిల్ డ్యాన్సులు మిరుమిట్లు గొలుపుతున్నాయి. రబ్బరులా సాగుతూ.. స్ప్రింగులా కదులుతూ సింపుల్ గా స్టెప్పులేస్తున్నాడు. శేఖర్ మాష్టర్ కొరియోగ్రఫీ అఖిల్ కి బాగా అస్సెట్ అయ్యింది.

కెరీర్ మూడో సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని అఖిల్ ఎంతో శ్రమించాడు. `తొలి ప్రేమ` లాంటి ఫీల్ గుడ్ మూవీతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి తనకో హిట్టిస్తాడనే ఆశిస్తున్నాడు. జనవరి 26న ఈ సినిమా రిలీజవుతోంది. అఖిల్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. అక్కినేని బ్రాండ్ రొమాంటిక్ లవ్ స్టోరితో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి అక్కినేని- నందమూరి ఫ్యాన్స్ అఖిల్ కలను నెరవేరుస్తారనే అంచనాలేర్పడ్డాయి. మరో ఐదు రోజులే సమయం మిగిలి ఉంది. అందాకా.. కాస్త వేచి చూడాల్సిందే