Begin typing your search above and press return to search.

బ్ర‌హ్మాస్త్ర విల‌న్ ఆమె.. అందుకే అంత‌ కాన్ఫిడెన్స్

By:  Tupaki Desk   |   4 Dec 2020 12:06 AM GMT
బ్ర‌హ్మాస్త్ర విల‌న్ ఆమె.. అందుకే అంత‌ కాన్ఫిడెన్స్
X
`గలి గలి...` అంటూ పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ చాప్ట‌ర్ 1లో మౌనిరాయ్ హాట్ ఐటెమ్ నంబ‌ర్ లో అద‌ర‌గొట్టిన సంగతి తెలిసిందే. ఆ పాట సీరియ‌స్ మోడ్ లో ఉన్న యాక్ష‌న్ మూవీకి బిగ్ రిలీఫ్ అనిపించింది. ఆ ఒక్క పాట‌తో సౌత్ అంత‌టికీ మౌని ప‌రిచ‌య‌మైంది.

ఇటీవ‌ల ఆ పాట‌లో హాట్ కంటెంట్ ని మించి సోష‌ల్ మీడియాల్లో చెల‌రేగుతోంది మౌని. ఈ అమ్మ‌డి రెగ్యుల‌ర్ ఫోటోషూట్లు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. టీవీ వెండితెర న‌టిగా మౌని రాయ్ ప్రజాదరణకు హద్దులు అన్న‌వే లేవు. బాలీవుడ్ దివా తరచుగా సోషల్ మీడియాలో తన హాటెస్ట్ లుక్ తో నెటిజ‌నులు త‌న‌నే అనుసరించేలా చేస్తుంది.

ఇటీవ‌ల‌ మౌనిలో హాట్ యాంగిల్ యువ‌త‌రంలో ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొస్తోంది. తన బోల్డ్ అవతార్ ‌తో ఇంటర్నెట్ ‌ను బ్రేక్ చేస్తోంది. అభిమానులకు మౌని ట్రీట్ ఇటీవ‌ల ప‌రాకాష్ట‌కు చేరుకుంద‌నే చెప్పాలి.

కెరీర్ సంగ‌తి చూస్తే... మౌని రాయ్ చివరిసారిగా స్పై-థ్రిల్లర్ చిత్రం లండన్ కాన్ఫిడెన్షియల్ లో కనిపించారు. ఆమె ఇప్పుడు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్రాలో న‌టిస్తోంది. అమితాబ్ బచ్చన్,... రణబీర్ కపూర్ అలియా భట్ త‌దిత‌రులు న‌టిస్తున్న‌ ఈ మూవీ చిత్రీక‌ర‌ణ‌లో ఉంది.

`బ్రహ్మస్త్ర` 2020 సీజ‌న్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్. ఇది కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన పాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఇందులో హాట్ మౌని రాయ్ నెగెటివ్ రోల్ పోషిస్తోంది.