Begin typing your search above and press return to search.

బికినీతో మత్తెక్కిస్తున్న మౌనీరాయ్..!

By:  Tupaki Desk   |   7 Feb 2023 6:00 AM GMT
బికినీతో మత్తెక్కిస్తున్న మౌనీరాయ్..!
X
డబ్బింగ్ సీరియల్ నాగిని తో పాపులారిటీ దక్కించుకున్న మౌనీరాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై టీవీ షోలు, సీరియళ్లలో సందడి చేసిన మౌనీ రాయ్... ఇప్పుడు సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. అభిషేక్ బచ్చన్ రన్ సినిమాలో స్పెషల్ సాంగ్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తుమ్ బిన్ 2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్ లోనూ స్పెషల్ సాంగ్ లో చేసింది. తాజాగా బ్రహ్మాస్త్ర సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించింది. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఈ హాట్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలతో పాటు పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఎక్కువగా గ్లామర్ షో చేసే ఈ ముద్దుగుమ్మ కుర్రకారుకు ఎప్పుడూ హీటెక్కిస్తుంది. అందాలను ఆరబోస్తూ అందరినీ కట్టిపడేస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ బ్లాక్ బికినీ వేస్కొని ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. స్టన్నింగ్ స్టిల్స్ తో అందాల విందులో నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటోంది. బ్లాక్ కలర్ క్లాత్ చుట్టుకొని నడుముకు... యాష్ కలర్ బ్రాలో కనిపించింది.

ఎద ఎత్తుపల్లాలతో పాటు నడుము అందాలను కనిపించేలా చేస్తోంది. నయాగార ఫాల్స్ లా నడుమును తెగ తిప్పేస్తూ... హాట్ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. జర్మన్ సిల్వర్ జ్యువెల్లరీతో అందంగా ముస్తాబై కనిపించింది. 26 మిలియన్ల ఫాలోవర్లను కల్గిన ఈ బ్యూటీ ఇప్పటి వరకు 2 వేల 949 పోస్టులను అభిమానులతో పంచుకుంది.

ఈ ఫొటోలు చూసిన అభిమానులు లైకులు, షేర్లు, కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే నాలుగు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. వేలల్లో కామెంట్లు వచ్చాయి.

చాలా హాట్ గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. నీ అందాన్ని తట్టుకోలేక పోతున్నామని అంటున్నారు. అయితే హాట్ బ్యూటీ అందాలను వీక్షించేందుకు మిలియన్ల కొద్దీ ఈమెను ఫాలో అవుతుంటారు. ఆమె కూడా నెటిజెన్లను ఏమాత్రం నిరాశ పరచకుండా తరచుగా ఫొటోలు షేర్ చేస్తూ కవ్విస్తుంటుంది. రోజురోజుకీ ఈ అందాల ముద్దుగుమ్మకు ఫ్యాన్స్ తో పాటు హాట్ నెస్ కూడా ఎక్కువైంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.