#స్టార్స్.. అమ్మ ప్రేమను మించిన ప్రేమ ఉందా?

Sun May 09 2021 15:35:01 GMT+0530 (IST)

Mothers Day Celebrations of Tollywood Stars

అమ్మ సెంటిమెంటుపై సినిమాలు తీయడంలోనే కాదు నిజజీవితంలోనూ అమ్మ ప్రేమను మించి ఇంకేదీ లేదని చెప్పే మన స్టార్ హీరోల మమతానురాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మెగాస్టార్ చిరంజీవి మొదలు మహేష్.. చరణ్.. పవన్.. తారక్.. ప్రభాస్ .. ఇలా స్టార్లంతా వారికి నిజ జీవితంలోనూ మదర్ సెంటిమెంట్ అంతా ఇంతా కాదు.నేడు మదర్స్ డే సందర్భంగా టాలీవుడ్ స్టార్లంతా తమ మాతృమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు. తమ విలువైన సమయాన్ని సెకండ్ వేవ్ వల్ల స్టార్లు ఎవరికి వారు ఇండ్లలోనే గడుపుతున్నారు. పలువురు స్టార్లు కుటుంబంతో కలిసి మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తన తల్లిగారైన అంజనా దేవి.. ఇతర కుటుంబ సభ్యులతో స్పెండ్ చేస్తున్న ఓ ఫోటోని షేర్ చేశారు. ప్రపంచంలోని అమ్మలు అందరికీ హ్యాపీ మదర్స్ డే అంటూ వ్యాఖ్యను జోడించారు. ఇక చిరుతో పాటు నాగబాబు - పవన్ కల్యాణ్ కూడా ఈ ఫోటోలో ఉన్నారు. స్వార్థం అన్నదే లేని అమ్మ కోసం ఈ సెలబ్రేషన్ అని మహేష్ వ్యాఖ్యానించారు. వీరితో పాటు చాలామంది స్టార్లు సోషల్ మీడియాల్లో తమ మాతృమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు.