అన్నచెల్లెలిగా కనిపించనున్న హీరో-హీరోయిన్..!!

Mon Aug 03 2020 19:30:40 GMT+0530 (IST)

Hero-heroine who looks like a sister and Brother .. !!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచు విష్ణు చాలా గ్యాప్ తర్వాత ఓ సాలిడ్ హిట్ కొట్టడానికి ప్లాన్ చేసాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా పాన్ ఇండియా రేంజిలో విడుదల చేయనున్నాడట. గత రెండేళ్లుగా విష్ణు నుండి సినిమాలేవీ రాలేదు. కొన్నేళ్లుగా వరుస ప్లాప్ చిత్రాలను ఎదుర్కొని చాలా గ్యాప్ తీసుకున్నాడు. కానీ ఈసారి పక్కా ప్రణాళికతో తెరమీదకి రాబోతున్నాడట. ఇక ప్రస్తుతం విష్ణు "మోసగాళ్లు" అనే సినిమాతో రావడానికి రెడీ అవుతున్నాడు. సినిమాలు ఆపేసిన తర్వాత విష్ణుకి మార్కెట్ చాలా పడిపోయింది. అలాంటిది విష్ణు ఒక్కసారిగా మీడియా పరంగా "మోసగాళ్లు" సినిమాను హాలీవుడ్ లో రిలీజ్ చేస్తాను అనేసరికి అందరిలో కాస్త ఆసక్తి నెలకొంది. ఇంత గట్టి నిర్ణయం తీసుకున్నాడంటే ఖచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉండే ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇటీవలే విష్ణు మోసగాళ్లు సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.రెండు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి అక్కడ ఇద్దరు హాలీవుడ్ రైటర్లను తీసుకొని ఇండియాలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కాం గురించి కథ రెడీ చేసాడట. ఆ కథతో కేవలం హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ చిన్ తో సినిమా తీసి ఇంగ్లీష్ లోనే విడుదల చేద్దామని అనుకున్నాడట. ఇంతలో ఒక వ్యక్తి సలహా మేరకు తెలుగులో కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందని తెలుగులో మోసగాళ్లు పేరుతో మొదలుపెట్టాడు. ఈ సినిమా ఇంగ్లీష్ తెలుగు హిందీ బాషలలో రిలీజ్ కానున్నట్లు ప్రకటించాడు. హాలీవుడ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా మంచి ఎమోషన్స్ మెయింటైన్ చేసినట్లు తెలిపాడు. అయితే తాజాగా రక్షాబంధన్ సందర్భంగా ఈ సినిమా నుండి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. విష్ణుతో పాటు కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమాలో విష్ణు - కాజల్ అన్నచెల్లెలిగా నటిస్తున్నారు. ఇక పోస్టర్ లో కాజల్ బైక్ పై ఉండగా విష్ణు పక్కన నిలబడి చూస్తున్నాడు. ప్రస్తుతం పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాతో సునీల్ శెట్టి తెలుగుతెరకు పరిచయం అవుతున్నాడు.