Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ తో మరో 'బిగ్‌' ఛాన్స్ కొట్టేసిన మోనాల్‌

By:  Tupaki Desk   |   3 Aug 2021 7:30 AM GMT
బిగ్ బాస్ తో మరో బిగ్‌ ఛాన్స్ కొట్టేసిన మోనాల్‌
X
ఎప్పుడో అల్లరి నరేష్‌ తో నటించిన మోనాల్ గజ్జర్ ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో పాటు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సౌత్‌ సినిమాలకు దూరం అయ్యింది. తెలుగులో ఈమె మళ్లీ రీ ఎంట్రీ దాదాపు అసాధ్యం అనుకున్న సమయంలో అనూహ్యంగా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున హోస్ట్‌ గా చేసిన బిగ్‌ బాస్ సీజన్ 4 లో మోనాల్‌ స్పెషల్‌ కంటెస్టెంట్‌ గా జాయిన్ అయ్యింది ఆమె హౌస్ లో ఉన్నన్ని రోజులు విమర్శలు వచ్చాయి. అభిజిత్ మరియు అఖిల్‌ లతో స్నేహంను కంటిన్యూ చేయడం వల్ల ఆమెను చాలా మంది చాలా రకాలుగా అనుకుంటూ వచ్చారు. అయినా కూడా తన పద్దతిన తాను ఆడి చివరి వారం వరకు వచ్చింది. సీజన్ 4 లో ఆమె చాలా స్పెషల్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

బిబి తో రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల తెలుగు లో ఈమెకు వరుసగా ఆఫర్లు దక్కుతున్నాయి. ముఖ్యంగా తెలుగు లో ఈమె సినిమాల్లో నటించడమే కాకుండా వెబ్‌ సిరీస్ ల్లో కూడా ఆఫర్లు దక్కించుకుంటుంది. తాజాగా ఈమె హీరోయిన్ గా అఖిల్ హీరోగా ఒక ప్రాజెక్ట్‌ పట్టాలెక్కిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో ఐటెం సాంగ్‌ ను కూడా చేస్తోంది. ఇటీవలే ఒక సూపర్ హిట్‌ ఐటెం సాంగ్‌ లో ఆడి పాడింది. మళ్లీ బంగారంలాంటి ఛాన్స్ ఈ అమ్మడికి దక్కింది. అక్కినేని అభిమానులతో పాటు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్‌ బంగార్రాజులో ఈమెకు ఛాన్స్‌ దక్కింది.

సినిమాలో హీరోయిన్ గా కాకున్నా కూడా ఈమె ఒక పాటలో కనిపించబోతుంది. అంతే కాకుండా ఈమెది పాత్ర కూడా ఉంటుంది. కథలో కీలక పాత్రలో ఈమె కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా కనిపించబోతున్నాడు. సినిమాలో మోనాల్‌ సాంగ్‌ నాగార్జున మరియు నాగచైతన్యలతో ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా షూటింగ్‌ కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ఫిల్మ్‌ మేకర్స్ మరియు ప్రేక్షకులకు అతి త్వరలోనే బంగార్రాజు టీమ్‌ ఒక సర్‌ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా అక్కినేని వర్గాల నుండి సమాచారం అందుతోంది. బంగర్రాజు సినిమా కథ విషయంలో సుదీర్ఘ చర్చలు జరిగాయి. కనుక ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.