Begin typing your search above and press return to search.
నవ్విస్తూనే ఆద్యంతం థ్రిల్లిచ్చే సినిమా ఓటీటీలో
By: Tupaki Desk | 26 March 2023 8:00 PMమాలీవుడ్ బ్లాక్ బస్టర్ రోమంచం ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం బెంగళూరు నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కింది. 2007లో బెంగుళూరులో నివశించిన కొందరు స్నేహితుల కథేమిటన్నది తెరపై ఆవిష్కరించారు. హారర్ కామెడీ జానర్ ఇది.
ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే గాక విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
గుర్పొడిచే విన్యాసాలతో పాటు ఆద్యంతం నవ్వించే సినిమా రోమంచం. హారర్- సెటైరికల్ కామెడీ జానర్ లో సరికొత్త ట్విస్ట్ లతో అలరిస్తుంది. చాలా కాలం తర్వాత మలయాళంలో ఒక హార్రర్ కామెడీ ఈ స్థాయి విజయం సాధించింది.
జీతూ మాధవన్ దర్శకత్వ ప్రతిభ సాను తాహిర్ అద్భుతమైన కెమెరా పనితనం.. కిరణ్ దాస్ షార్ప్ ఎడిటింగ్ ఈ సినిమాకి ప్రధాన బలాలు. ముఖ్యంగా థ్రిల్స్ లోను కామెడీ ఎంటర్ టైన్ మెంట్ ఆడియెన్ ని మెప్పించింది. ఈ చిత్రం ఏప్రిల్ 1 నుండి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
హారర్ కామెడీ జానర్ లోనే వచ్చిన తెలుగు సినిమా `ప్రేమకథా చిత్రం` ఆద్యంతం నవ్విస్తూనే హారర్ కంటెంట్ తో భయపెడుతుంది. అలాగే ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన బాలీవుడ్ మూవీ భూల్ భులయా 2 కూడా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కినదే.
కాంచన సిరీస్ హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు భిన్నంగా హారర్- సెటైరికల్ కామెడీ జానర్ లో రోమంచం తెరకెక్కి మల్లూ ప్రేక్షకులను మెప్పించింది.