2022లో మోక్షజ్ఞ అరంగేట్రం ఖరారు

Sat Nov 27 2021 16:07:54 GMT+0530 (IST)

Mokshagna debut in 2022 has been finalized

నటసింహా నందమూరి బాలకృష్ణ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అఖండ రిలీజ్ అనంతరం పూర్తిగా తదుపరి చిత్రాలపై దృష్టి సారిస్తారు. గోపిచంద్ మలినేని అనీల్ రావిపూడి సహా పలువురు దర్శకులు ఇప్పటికే బాలయ్యకు కథలు వినిపించి లాక్ చేశారు. కొన్ని ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నాయి.పనిలో పనిగా బాలయ్య `ఆహా-ఓటీటీ` వేదికపై హోస్టింగ్ చేస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కల్మషం లేని మాట తీరు.. ముక్కు సూటిగా నిజాయితీగా ఉండే తత్వం.. టైమింగ్ లీ పంచ్ లతో బాలయ్య అదరగొడుతున్నారు.

ఆయనలో చిన్నపిల్లాడిలా భోళా తత్వం అందరికీ నచ్చుతోంది. మొత్తానికి ఆహా ఓటీటీకి ఇది పెద్ద ప్లస్ గా మారింది. ఈ వేదికపై బాలయ్యతో కాంబినేషన్లు ఆసక్తిని పెంచుతున్నాయి.

తాజా ఈవెంట్లో ఆయన తన వారసుడు మోక్షజ్ఞ సినీఎంట్రీ గురించి ముచ్చటించారు. నందమూరి మోక్షజ్ఞ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ తో ఉంటుందని మరోమారు స్పష్ఠతనిచ్చారు. 2022లో ఈ సినిమా మొదలవుతుందని వెల్లడించారు.

ఈ చిత్రానికి సింగీతం దర్శకత్వం వహిస్తారా లేక బాలయ్యనే స్వయంగా దర్శకత్వం వహిస్తారా? అన్నదానికి క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఇంతకుముందు మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగానూ ఈ ప్రాజెక్ట్ గురించి బాలయ్య క్లూ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ మూవీ ప్రారంభయ్యే దెపుడు? అన్న ఉత్కంఠ నెలకొంది.

మోక్షజ్ఞ నటనా రంగ ప్రవేశం చాలా దూరంలో లేదని ఇప్పటికి పూర్తిగా క్లారిటీ వచ్చేసినట్టే. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది చివర్లో సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది. మోక్షజ్ఞ డెబ్యూ చిత్రంలో బాలకృష్ణ కీలక పాత్రను పోషిస్తారని తెలిసింది.