మోహన్ లాల్ మరో సర్ ప్రైజ్..

Fri Aug 10 2018 15:53:07 GMT+0530 (IST)

సినిమా అంటేనే క్రియేటివిటీ.. ఎంత సృజనాత్మకంగా చూపిస్తే సినిమా అంత విజయం అవుతుంది. మూసధోరణితో సినిమాలు చేస్తే ఫ్లాపులు పలకరిస్తాయి. అందుకే ఈ మధ్య మన అగ్ర హీరోలు సినిమాలు తగ్గించేశారు. కొత్త కథలు రాకపోవడం.. అవే మూస సినిమాలు చేయడం ఇష్టం లేక వెంకటేశ్ - నాగార్జున - చిరంజీవిలు కాస్తా ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు.కానీ మలయాళ అగ్రనటుడు మోహన్ లాల్ అలా కాదు.. తన ఏజ్ పెరిగిన కొలదీ.. విలక్షణ కథలను ఎంచుకుంటూ అందులో పరకాయ ప్రవేశం చేస్తూ హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు. ఇటీవలే తెలుగులో రిలీజ్ డబ్బింగ్ అయిన మోహన్ లాల్ నటించిన ‘కనుపాప’ చిత్రం మలయాళంలో పెద్ద హిట్.. అగ్రహీరో అయ్యిండి ఈ సినిమాలో అంధుడిగా మోహన్ లాల్ నటించి మెప్పించాడు. ఇంత సాహసోపేతమైన డీగ్లామర్ పాత్ర చేయడానికి ఏ టాలీవుడ్ హీరో కూడా సాహసించడంటే అతిశయోక్తి కాదు.. అలా విలక్షణంగా వెళుతున్నాడు కాబట్టే ఆయనకు విజయాలు వరిస్తున్నాయి.

తాజాగా మోహన్ లాల్ మరో సంచలన చిత్రంలో నటిస్తుంటాడు. ‘ఒడియన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ కథలో మోహన్ లాల్ విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. యుక్త వయస్కుడిగా.. పండు ముసలివాడిగా.. అలాగే కొన్ని సార్లు జంతువుగా మారిపోతాడట.. ఇలా మూడు నాలుగు పాత్రల కోసం తాజాగా మోహన్ లాల్ బాగా సన్నబడి షాకింగ్ లుక్ లోకి మారిపోయాడు. సినిమా లో చూస్తే అందరూ షాక్ అవ్వడం ఖాయమని చిత్రం యూనిట్ చెబుతోంది. శ్రీకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.