Begin typing your search above and press return to search.

చిరంజీవితో గొడవలు.. ఎట్టకేలకు నోరువిప్పిన మోహన్ బాబు

By:  Tupaki Desk   |   19 March 2023 5:51 PM GMT
చిరంజీవితో గొడవలు.. ఎట్టకేలకు నోరువిప్పిన మోహన్ బాబు
X
సీనియర్ నటుడు మోహన్ బాబు మరోసారి ఎమోషనల్ కు గురయ్యారు. తన కష్టాలను పంచుకుంటూ ఆవేదన చెందారు. ఈరోజు తన 71వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ , రాజకీయ ప్రముఖులు మోహన్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

వ్యక్తిగత విషయాలతోపాటు చిరంజీవితో గొడవల గురించి నోరు విప్పాడు. ‘ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాను. ఒక టీచర్ అయిన నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా, విలన్ గా, నటుడిగా, హీరోగా, ఒక యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గా ఎదిగాను’ దానికి కారణం నా తల్లిదండ్రుల ఆశీస్సులు, ప్రేక్షకుల ఆశీర్వాదాలు.. నేను పడిన కష్టాలు పగవాడు కూడా పడకూడదని కోరుకుంటున్నా.. నేను సంపాదించినన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇల్లు, స్థలాలు, అన్ని అమ్మేశాను. తిరిగి సాధించాను. ఇల్లే కాదు ఒక యూనివర్సిటీనే స్థాపించాను’ అంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యాడు.

నా జీవితంలో సన్నాఫ్ ఇండియా ఒక ప్రయోగం.. అది ఎందుకు ఫ్లాప్ అయ్యిందో తెలియదని మోహన్ బాబు అన్నారు. ఇక నాకు, చిరంజీవికి మధ్య గొడవలు ఉన్నాయి.. అయినా మేం ఇద్దరం మాట్లాడుకుంటాం. పలకరించుకుంటాం.. మా గొడవలు భార్యాభర్తల లాంటివి. ఎంత పొట్లాడుకున్నా.. మళ్లీ కలిసిపోతూ ఉంటాం.. ఇక నేను ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేదు. ఎన్టీఆర్, కృష్ణ మరణించినప్పుడు ఈ మధ్య జరిగిన మనోజ్ పెళ్లిలో కూడా ఏడ్చేశాను. మా మీద సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. వాటిని పట్టించుకోను అంటూ మోహన్ బాబు ఆవేదన చెందాడు.

విష్ణు ‘జిన్నా’ ఫెయిల్యూర్ పై కూడా మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘జిన్నా ఎందుకు విజయం సాధించలేకపోయిందనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అది మంచి సినిమా.. ఓటీటీలో మంచి ఫలితాలు అందుకుంది’ అని మోహన్ బాబు తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.