Begin typing your search above and press return to search.

వైమానిక ద‌ళ అధికారిగా ఎంబీ లుక్

By:  Tupaki Desk   |   28 Feb 2020 12:31 PM GMT
వైమానిక ద‌ళ అధికారిగా ఎంబీ లుక్
X
క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు పెద్ద‌ తెర‌పై పూర్తి స్థాయి పాత్ర‌లో క‌నిపించి చాలా కాల‌మే అయ్యింది. అప్ప‌ట్లో ఆర్జీవీ ఫ్యాక్ష‌న్ సినిమా రౌడీలో క‌నిపించారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ పూర్తి స్థాయి పాత్ర‌లో క‌నిపించిందే లేదు. అందుకే ఎంబీ స్థాయికి త‌గ్గ పాత్ర‌ లో చూడాల‌న్న‌ది అభిమానుల ఆకాంక్ష‌. అయితే అది నెర‌వేరే రోజొస్తోంది.

ప్ర‌స్తుతం సూర్య క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `ఆకాశం నీ హ‌ద్దురా` చిత్రంలో మోహ‌న్ బాబు ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇందులో అతడి పాత్ర పేరు భ‌క్త‌వ‌త్స‌లం నాయుడు. మూవీ నుంచి ఆయ‌న లుక్ ని రిలీజ్ చేశారు. వైమానిక ద‌ళ అధికారిగా మోహ‌న్ బాబు ఎంతో ఎగ్రెస్సివ్ గానే క‌నిపించారు. యూనిఫామ్ లో ఏదో సీరియ‌స్ గా ఆలోచిస్తూ క‌నిపిస్తున్నారు. ఇక ఆ పాకెట్ పై ఎంబీ నాయుడు అని పేరు క‌నిపిస్తోంది. అంటూ మంచు భ‌క్త‌వ‌త్స‌లం నాయుడు అనే పేరు అది.

ఈ మూవీ క‌థ ఎంతో ఇంట్రెస్టింగ్. సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితాధారం గా రూపొందుతున్న సినిమా ఇది. జేబులో 6 వేల రూపాలు పెట్టుకుని పట్టణం వచ్చిన వ్యక్తి విమానాల‌ కంపెనీని ఎలా స్థాపించాడు? ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అన్న‌ది తెపై చూపిస్తున్నారు. సూర్య టైటిల్ పాత్ర పోషిస్తుంటే త‌న గురువు పాత్ర‌లో మోహ‌న్ బాబు న‌టిస్తున్నారు. జి.వి.ప్రకాష్‌ కుమార్‌ నేపథ్య సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది. సుధ కొంగ‌ర ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. 2డీ ఎంటర్ టైన్ మెంట్‌ పతాకంపై తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. గుర్నీత్ మోంగాతో క‌లిసి సూర్య నిర్మిస్తున్నారు.